ఏప్రిల్‌ 20న భ‌ర‌త్, మే 4న సూర్య

0

రెండు చిత్రాల నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందం ఏప్రిల్‌ 26నే ‘భరత్‌ అనే నేను’, ‘నా పేరు సూర్య’ విడుదలవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు దిల్‌ రాజు, కె.ఎల్‌.నారాయణ, నాగబాబుగార్ల సమక్షంలో ఈ రెండు చిత్రాల నిర్మాతలు ప్రత్యక్షంగా సమావేశం అయ్యారు. రెండు భారీ చిత్రాలు ఒక రోజు విడుదలవడం ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదని భావించిన వీరు ఒక అండర్‌ స్టాండింగ్‌కి వచ్చారు.

ఈ సందర్భంగా నిర్మాతలు డి.వి.వి.దానయ్య, లగడపాటి శ్రీదర్‌, బన్నీ వాసు మాట్లాడుతూ – ”ఈ రెండు భారీ చిత్రాల మధ్య కనీసం రెండు వారాలు గ్యాప్‌ ఉండాలన్న ఉద్దేశంతో ఏప్రిల్‌ 20న ‘భరత్‌ అనే నేను’, మే 4న ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రాల్ని విడుదల చెయ్యడానికి నిర్ణయించాం. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్న అభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సపోర్ట్‌ చేసిన మా హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అన్నారు.

ఏప్రిల్‌ 20న ‘భరత్‌ అనే నేను’, మే 4న ‘నా పేరు సూర్య’ విడుదల తేదీలు కన్‌ఫర్మ్‌ అయిన నేపథ్యంలో పెద్దలు దిల్‌రాజు. డా.కె.ఎల్‌.నారాయణ, నాగబాబుగార్లు మాట్లాడుతూ – ”రెండు భారీ చిత్రాల విడుదల మధ్య కనీసం రెండు వారాలు గ్యాప్‌ ఇవ్వడం పరిశ్రమకు చాలా మంచిది. సంక్రాంతి సీజన్‌ని మినహాయిస్తే మిగిలిన సందర్భాల్లో రెండు భారీ చిత్రాల మధ్య ఇలా రెండు వారాలు గ్యాప్‌ ఇచ్చి రిలీజ్‌ డేట్స్‌ ప్లాన్‌ చెయ్యడం వలన పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుంది. ‘భరత్‌ అనే నేను’, ‘నా పేరు సూర్య’ నిర్మాతల మధ్య మంచి అండర్‌ స్టాండింగ్‌ కుదరడం ఓ శుభపరిణామంగా భావిస్తున్నాం” అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నా నువ్వే` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts