బాపు నాకు గురువు- అనిల్ కపూర్

0

7c78a64b2950c0dc21c7a07418019fed_mఎందరో నటీనటులని సినిమా రంగానికి పరిచయం చేసి-వాళ్ళు ఉన్నతమైన స్థానాలని చేరుకోవడానికి రాజబాట వేసిన ఘనత దివంగత దర్శకుడు – ప్రఖ్యాత చిత్రకారుడు బాపుదే అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. బాపు వల్ల బాలీవుడ్ లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని టాప్ రేంజ్ కి చేరిన అనిల్ కపూర్ బాపు గురించి తన భావాలని తాజాగా మీడియాతో ఇలా పంచుకున్నాడు.

“నన్ను నటుడిగా మలచిన ఘనత ప్రముఖ దర్శకుడు బాపుదే అని చెప్పాలి. 1980లో ఆయన దర్శకత్వంలో వహించిన ‘వంశవృక్షం’ చిత్రం ద్వారా నేను తెరంగ్రేటం చేశాను. సినిమాల్లో ఎలా నటించాలి , ఏ పాత్రని ఎలా పోషించాలి అనేది నేను బాపు నుంచి నేర్చుకున్నాను. అందుకే బాపు నాకు గురువు, నా కెరీర్ ని తీర్చిదిద్దిన మెంటార్ “అని అనిల్ తన పాత జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రఖ్యాత దర్శకులతో నటించానని… అయితే బాపు దర్శకత్వంలో నటించడం తన అదృష్టమన్నారు. బాపు విభిన్న శైలిలో చిత్రాలను తెరకెక్కిస్తారని అనిల్ ఈ సందర్బంగా ప్రశంసించారు. వంశవృక్షంలోనే కాకుండా బాపు హిందీలో తీసిన ‘వోహ్ సాత్ దిన్’ చిత్రంలో కూడా నటించానన్నారు. ఆయన దర్శకత్వం ప్రత్యేక శైలిలో ఉంటుందని గుర్తు చేశారు. బాపు మరణంతో దేశం మంచి దర్శకుడ్ని కోల్పోయిందని అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌న్నీలియోన్ నా..మ‌జాకా!
హీరోయిన్ల‌లో ఎవ‌రికైనా ఇంత ఫాలోయింగ్ ఉంటుందా? ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం ఏ హీరోయిన్ కోస‌మైనా వ‌చ్చారా? అంటే ఇక‌పై ఠ‌క్కున గుర్తొచ్చే ఒకే ఒక...
బి..సీల్లో తేడాసింగ్ ర‌చ్చ ర‌చ్చే!
నంద‌మూరి న‌ట‌సింహాన్ని (బాల‌కృష్ణ‌) ఇప్ప‌టివ‌ర‌కూ ఒక యాంగిల్ లోనే చూశాం. ఇప్పుడు రెండ‌వ యాంగిల్ ను డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `పైస...
వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
powered by RelatedPosts