ఏప్రియల్ 20 నుంచి 'బాహుబలి' ప్రమోషన్

0

bahubali-new-look-hd-wallpaperప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బాహుబలి’. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా కీలక పాత్రధారి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం దర్శక,నిర్మాతలు… పూర్తిగా ప్రమోషన్ పై దృష్టి పెట్టడానికి సిద్దపడుతున్నారు. మే 10 న ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ విడుదల కానుందని సమాచారం. అలాగే ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన డాక్యుమెంట్ ని సైతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

చిత్రానికి సంభందించిన ప్రమోషన్ …ఏప్రియల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రియల్ 25 న చిత్రానికి సంభిందించిన షార్ట్ టీజర్ వస్తుందని తెలుస్తోంది. అలాగే…చిత్రానికి సంభిందించిన వాల్ పోస్టర్స్ డిజైన్స్ ఫైనల్ చేస్తున్నారని,సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వాటిని విడుదల చేస్తారని వినికిడి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఊపందుకుంది. త్వరలోనే ఇక టీజర్స్ వచ్చి మనని అలరిస్తాయి. తన వూహల రాజ్యం మహిష్మతి నేపథ్యంలో ఓ డాక్యుమెంట్‌ని రూపొందించబోతున్నారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆ రాజ్యంలో ప్రజల జీవన స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, రాజకీయాలు, వైద్యం, కుటుంబ అనుబంధాలు… ఎలా ఉండేవో చెబుతూ ఆ డ్యాక్యుమెంట్‌ని రూపొందిస్తారు. ‘బాహుబలి’ వెయ్యేళ్ల క్రితం నాటి కథ కావడంతో… నాటి వాతావరణాన్ని వూహిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉండేలా డాక్యుమెంట్‌ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది చిత్రబృందం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ..గౌర‌వంగాను భావిస్తున్నాను: ద‌ర్శ‌క ధీర‌డు రాజ‌మౌళి
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు స...
చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి తో యంగ్ టైగ‌ర్ మూవీ!
టాలీవుడ్ లో వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు చంద్ర శేఖ‌ర్ ఏలేటి. ఆయ‌న క‌థ‌లు చాలా ఇన్నో...
వ‌డివేలు వెయిట్ త‌గ్గాడు
త‌మిళ హాస్య నటుడు వడివేలు ప్రధానపాత్ర పోషిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘ఇంసై అరసన్‌ 23 ఆమ్‌ పులికేసి- 2’ కోసం తన శరీర బరువు తగ్గించుకున్నారు. ఇద...
powered by RelatedPosts