ఆవిడకి మళ్ళీ ఛాన్స్ దొరికిందట

0

Asin_7_08మళయాళీ కుట్టి , ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆసిన్ కొన్నేళ్ల పాటు తెలుగు తమిళ సినిమాలలో ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అమ్మడికి ఇక్కడ అవకాశాలు తగ్గడం తో బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నంలో మొదట ఒకటి అరా హిట్స్ ఇచ్చినా, తరువాత మొత్తానికే సినిమాలు లేని పరిస్థితి. పైగా టాను ఎంతో నమ్మి పెట్టుకున్న ఇద్దరు మేనేజర్లు అమ్మడిని అమాంతం ముంచేసరికి ఏం చేయాలో దిక్కు తోచక ప్రస్తుతం అసిన్ మళ్లీ కోలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తోందట.

తాజా సమాచారం ప్రకారం మాధవన్ హింది-తమిళంలో చేయబోతున్న సినిమాలో అసిన్ కి ఛాన్స్ దొరికిందట. అయితే నిర్మాతలు పారితోషికం ఎంతిమ్మంటారు అని అడిగితే, నేనేం చెప్తాను..మీరే ఎంతో కొంత ఫిక్స్ చేయండి అని చెప్పిందట….అసలే డిమాండ్ చేసే పరిస్థితిలో కూడా లేదు కదా మరి…..!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts