ఇడ్లీ-దోశ-పొంగల్ కుమ్మేశాడు

0

Arnoldఎప్పుడు పిజ్జాలు-బర్గర్లు తినే మనిషికి, మన సౌత్ ఇండియన్ ఫుడ్ రుచి చూపిస్తే ఊరుకుంటారా ఎవరైనా? అదే పని హాలీవుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ కూడా చేశాడు. మొన్న “ఐ” చిత్రం తాలూకు ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన ఆర్నాల్డ్, చెన్నైలో దిగిన రోజున అడిగి మరీ ఇడ్లీ-దోశ-పొంగల్ తెప్పించుకుని ఆవురావురుమని తిన్నాడట. వాటి రుచికి ఆహా ఒహో అనుకున్న ఆర్నాల్డ్, మన దక్షిణాది వంటకాలపై మనసు పారేసుకున్నాడట. అయితే, వాటిని అరిగించుకోవడానికి ఏకధాటిగా ఆరు గంటల పాటు జిమ్ లో వర్కవుట్లు చేశాడట.

అంతేకాకుండా ష్వార్జ్ నెగర్ తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టుపై కూడా మనసు పడ్డాడట. ఈవిషయాన్ని ‘ఐ’ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసిందుకు ష్వార్జ్ నెగర్ పంచెకట్టులో వెళదామనుకున్నా… సమయం సరిపోనందున ‘అమ్మ’ను సూట్ లోనే కలిసినట్లు రవిచంద్రన్ తెలిపాడు. ‘ష్వార్జ్ నెగర్ 3.30కి లాండ్ అయ్యాడు. 5.30కి బ్రేక్ ఫాస్ట్ చేశాడు…ఆ తర్వాత జిమ్ లో ఆరు గంటలు గడిపాడు’ . ఫిట్ నెస్ పై ష్వార్జ్ నెగర్ కి ఉన్న అంకిత భావం చూసి చిత్ర యూనిట్ స్టన్ అయ్యారట. ఆరు పదులు వయసు దాటినా ష్వార్జ్ నెగర్ ఇప్పటికీ కుర్రాడిలా షూటింగ్ లో ఫైట్స్ చేస్తూ కాళ్లు చేతులకు గాయాలు తగలించుకోవటం అలవాటే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts