శంకర్ ని ఛాన్స్ అడిగిన ఆర్నాల్డ్

0

shankar300ఈ ఒక్క ఉదాహరణ చాలు, భారతీయ సినిమాని శంకర్ ఎలా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడో తెలుస్తుంది. భారతదేశం గర్వించదగ్గ సినిమా డైరెక్టర్లలో శంకర్ ముందు వరుసలో ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఆ విషయం రజనీకాంత్ తో తీసిన “రోబో” చిత్రం ద్వారా చాలామందికి తెలిసింది. ఇక ఇప్పుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న “ఐ” చిత్రంతో, భారతదేశ సినిమా స్టామినా ని శంకర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ పరిచయం చేయబోతున్నాడు. నిన్న చెన్నైలో జరిగిన “ఐ” చిత్ర గీతావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ముఖ్య అతిధిగా హాజరయిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆర్నాల్డ్ మాట్లాడుతూ ‘నేను ఇక్కడికి అవకాశం కోసం వచ్చాను. శంకర్ గారూ… మీ దర్శకత్వంలో నటించే అవకాశం నాకూ కల్పించండి’’ అని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తరువాత “ఐ’ గురించి మాట్లాడుతూ “నేను చెన్నైకి తొలిసారిగా వచ్చాను. చెన్నై అందమైన నగరం. ఇక్కడి ప్రజలు మంచి కళాపోషకులు’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య అన్నారు. అలాగే, ‘‘ఈ ‘ఐ’ చిత్రంలో బాడీబిల్డర్స్‌కు అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే నేను మొదట బాడీబిల్డర్‌గానే సినీ రంగ ప్రవేశం చేశాను’’ అని ఆయన తన సినీ రంగపు తొలినాళ్ళను గుర్తు చేసుకున్నారు. ‘‘ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ.. ‘‘శంకర్ గొప్ప దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నటించాలని ఆశగా ఉంది. ‘ఐ’ చిత్రం అద్భుతాల నిలయంగా ఉంటుందని అనిపిస్తోంది’’ అని “ఐ” మీద అందరికీ అంచనాలని భారీగా పెంచేసాడు.

ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. పాటల సీడీని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆవిష్కరించగా, తొలి ప్రతిని కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ వింత మృగం వేషం ధరించి వేదికపై ఒక పాటకు నటించడం విశేషం. అలాగే, ఏ.ఆర్. రెహ్మాన్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సైతం ఆడియో ఆవిష్కరణ వేదికపై పాడారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ‘ఐ’ పేరుతోనే విడుదల చేయనున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్‌తో కలిసి ఆస్కార్ సంస్థే తెలుగులోనూ విడుదల చేయనుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts