ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టెలివిషన్ మరియు చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ‘అంబికా’ కృష్ణ

0

APFDC Chairman
‘భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా అగరుబత్తి’ అనే కాప్షన్ దేనికి సంబందించినదో తెలుగు వారికి తెలియనిది కాదు. ఏడు దశాబ్దాలుగా అగరుబత్తి పరిశ్రమలో అంబికా అగ్రగామి సంస్థ గా నిలిచింది. ఏలూరు నియోజక వర్గం నుండి తెలుగు దేశం పార్టీ లో ముఖ్య రాజకీయ వేత్తగా, ఇటు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న అజాత శత్రువు అంబికా కృష్ణ. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టి వి మరియు చలచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అంబికా కృష్ణ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా జులై 10 న సాయంత్రం గౌరవ సూచకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఆయన ఛాంబర్ లో కలిసి ధన్యవాదాలు తెలుపుకున్నారు అంబికా కృష్ణ మరియు తనయుడు అంబికా రామ చంద్ర రావు.
APFDC Chairman
ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ ” ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఈ పదవి వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. మేము అగర బత్తి పరిశ్రమ నుంచి వచ్చిన, సినిమా పరిశ్రమ మీద వున్నా అభిమానం తో చాలా ఏళ్లుగా నిర్మాత గా, పంపిణీదారుడిగా, మరియు థియేటర్స్ యజమానిగా అభివృద్ధి చెందడానికి ఈ రంగం లో కూడా తెలుగు ప్రజలు మమ్మల్ని ఆదరించారు. సినిమా పరిశ్రమలో వున్నా అన్ని రంగాల్లో నా కున్న అనుభవాన్ని గుర్తించి, ఈ రోజు నాకు అనితర బాధ్యతను అప్పగించిన ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఆంధ్ర ప్రదేశ్ లో టి వి మరియు సినిమా పరిశ్రమ ను అభివృద్ధి చేయడానికి, టి వి సినీ పరిశ్రమ పెద్దలతో కలిసి నా వంతు కృషి చేస్తాను.” త్వరలో చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు అయన చెప్పారు.
APFDC Chairman

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts