అంజలి ఫుల్ ఖుషీ..

0

2_11_1068_Anjali Saree Stills (13)‘కత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్‌ ప్రస్తుతం శింబుదేవన్‌ దర్శకత్వంలో ‘పులి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై పి.టి.సెల్వకుమార్‌, శిబు ఈ చిత్రానికి నిర్మాతలు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి తెలుగులో ఇంకా టైటిల్‌ కన్‌ఫర్మ్‌ చెయ్యలేదు. విజయ్‌ సరసన శృతిహాసన్‌, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజుల కాలానికి సంబంధించిన కథ కూడా ఉంది. అందులో రాజు, రాణిలుగా సుదీప్, శ్రీదేవి, వీరి కూతురు యువరాణిగా హన్సిక నటిస్తున్నారు.

కాగా తాజా వార్తల ప్రకారం భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందట. ఈ కీలక పాత్ర చేసే అవకాశం హీరోయిన్ అంజలికి దక్కింది. అంజలి పాత్ర నిడివి తక్కువగా ఉంటుందట. కానీ కథకు ఈ పాత్ర చాలా కీలకం కావడంతో అంజలి ఈ పాత్ర చేయడానికి అంగీకరించిందని సమాచారమ్. ప్రస్తుతం తమిళంలో ‘అప్పా టక్కర్’, ‘మాపిలై సింగమ్’, ‘ఇరైవి’ చిత్రాలు చేస్తోంది. కన్నడలో ‘ధీర రానా విక్రమాక్క’లో నటిస్తోంది. తెలుగు, హిందీలో రూపొందుతోన్న ‘చిత్రాంగధ’ చిత్రం చేస్తోంది. ఇవి కాకుండా నందమూరి నటసింహం 99వ చిత్రంలో నటించే అవకాశం అంజలికి దక్కింది ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ‘పులి’ చిత్రంలో నటించే అవకాశం దక్కడంతో అంజలి ఫుల్ ఖుషీగా ఉందట. అమ్మడు కెరియర్ మంచి ఊపు మీద ఉందని చెప్పొచ్చు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts