అమితాబ్-జాకీచాన్ కలియికలో సినిమా?

0

Amitabh-Bachchan-Jackie-Chanభారత్ చైనా దేశాల మధ్యన స్నేహ సంబంధం అంతంత మాత్రాంగానే ఉన్నా, ప్రస్తుతం ఆ బంధం సినిమాల రూపంలో మరింత బలపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. తొలి ఇండో-చైనీస్ చలనచిత్ర రూపకల్పనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. ‘గోల్డ్ స్ట్రక్’ పేరిట రూపొందే ఈ చిత్రంలో భారత, చైనా సినీ పరిశ్రమలకు చెందిన దిగ్గజాలు పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల భోగట్టా.

అదే గనక నిజమైతే, ఈ చిత్రంలో మన ‘బిగ్ బి’ అమితాబ్, చైనా సినీ సూపర్‌స్టార్ జాకీ చాన్‌లు కలసి వెండితెరను పంచుకోనున్నారు. ఆధునిక కాలానికి చెందిన సాహస గాథగా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇందులో భారత, చైనాల సమున్నత సంస్కృతీ సంప్రదాయాలతో పాటు పునర్జన్మకు సంబంధించిన కథ ఉంటుందట. అంతేకాక, ఈ చిత్రంలో అభయ్ డియోల్, అందాల నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు కూడా నటించనున్నారు అని వినికిడి. అధికారిక ప్రకటన వెలువడాల్సిన ఈ చిత్ర వ్యవహారం అప్పుడే మన సినీ పరిశ్రమలో సంచలన వార్తగా మారింది.

ఏదేమైనా.. అమితాబ్-జాకీచాన్ ల కలయిక తెరమీద ఒక చరిత్రలా మిగిలిపోతుంది. ఈ ఇద్దరు విశిష్ట వ్యక్తులని చూడటానికి అభిమానులు పోటీపడతారు అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts