బాహుబ‌లి` చూడ‌ని ఒకే ఒక్క‌డు!

0
తొలిసారి భార‌తీయ జెండాను అంత‌ర్జాతీయ స్థాయిలో రెప‌రెప‌లాడించిన చిత్రం `బాహుబ‌లి`. వ‌సూళ్ల ప‌రంగానూ రికార్డుల మొత మ్రోగించింది. ఈ మొత చూసి బాలీవుడ్ దిగ్గ‌జాలే దిగొచ్చి అబ్బా బాహుబ‌లి అన్నారు. అయితే ఆ ఒక్క‌రు త‌ప్ప‌. ఆయ‌నెవ‌రో కాదు మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్. ఆయ‌న ఇంకా బాహుబ‌లి సినిమా చూడాలేద‌ట‌. కానీ సినిమా గురించి మాత్రం త‌న మాట‌ల్లో ఆకాశానికి ఎత్తేశాడు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే…
ఇన్నాళ్టికి అత‌గాడికి అవ‌కాశం చిక్కింది. బాహుబ‌లి అద్భుత విజ‌యం నిజంగానే క‌ళ్లు తెరిపించింది. ఆ సినిమాని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంద‌ని నొక్కి చెప్పాడు. మంచి క‌థ‌, క‌థ‌నం, అందుకు స‌మ‌కుదిరే పాత్ర‌ల‌తో ఎలాంటి మ్యాజిక్ అయినా చేయొచ్చని, స‌క్సెస్‌కి భాష‌తో ప‌ని లేద‌ని… బాహుబ‌లి సిరీస్ నిరూపించింద‌ని ప్ర‌శంసించాడు. బాహుబ‌లి యూనిట్‌కి శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఇక మీద‌ట‌ హిందీ సినిమా స్టామినా మ‌రెంతో ఉంద‌ని తెలుసుకోవాల్సి ఉంద‌ని కామెంట్ చేశాడు. ఇక బాహుబ‌లి ఫ్రాంఛైజీ మ‌రిన్ని సినిమాలు తీయాల‌ని, ఆ ఫ్రాంఛైజీతో అంద‌రూ ప‌ని చేయాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌ని అమీర్ తెలిపాడు. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇంకా బాహుబ‌లి సినిమా చూడ‌లేద‌ని, తొంద‌ర్లోనే చూస్తాన‌ని తెలిపాడు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
సుధీర్ బాబు తో ఇంద్ర‌గంటి `స‌మ్మోహ‌నం`
సుధీర్‌బాబు, బాలీవుడ్ న‌టి అదితిరావు హైద‌రీ జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ న...
"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
powered by RelatedPosts