నేడు హాస్య న‌ట‌ శిఖ‌రం అల్లు రామ‌లింగ‌య్య 11వ వ‌ర్ధంతి

0

హాస్యానికి చిరునామ అల్లు రామ‌లింగ‌య్య‌. ద‌శాబ్ధాల కాలం పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న హాస్యంతో న‌వ్వులు పువ్వులు పూయించారు. ఆయ‌న ఎలాంటి పాత్ర పోషించిన అంత‌ర్లీనంగా హాస్యం దాగి ఉంటుంది. ఆయ‌న తెర‌పై క‌నిపిస్తేనే మనసులోంచి న‌వ్వు ఉప్పొంగుతుంది. హాస్యం అంటే అల్లు..అల్లు అంటేనే హాస్యం! అంత‌గా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నాటుకుపోయారు. కాగా నేడు అల్లు రామ‌లింగ‌య్య వ‌ర్ధంతి సంద‌ర్భంగా… ఆయన పంచిన హాస్యసుగంధాన్నిఓ సారి నెమ‌ర‌వేసుకుందాం…

అల్లు రామలింగయ్య కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్ర‌ల‌తో, ఆ తరువాత ఎన్నో వందల చిత్రాల్లో తన హాస్యంతో నటవిశ్వరూపం చూపించారు. అలాగ‌ని హాస్యం ఒక్క‌టే ఆయ‌న స్పెషాలిటీ అనుకుంటే పొర‌బ‌డిన‌ట్లే…. సెంటిమెంట్ స‌న్నివేశాల్లో…..విల‌న్ పాత్ర‌ల్లో త‌న‌దైన శైలిలో ద‌శాభ్ధాల కాలం పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.అల్లు రామలింగయ్య ఏం చేసినా? అది నవ్వులు పూయించడం రివాజయింది. అదే ఎన్నో చిత్రాలకు సక్సెస్ ఫార్ములాగా మారింది.

నిజ జీవితంలో హోమియోపతి వైద్యం చేస్తూనే మరోవైపు సినిమాల్లో దొరికిన‌ పాత్ర‌లు చేసేవారు. చివ‌రికీ సినిమానే జీవిత‌మ‌ని భావించిన ఆయ‌న త‌ర్వాత పూర్తిగా సినిమా ప్ర‌పంచంవైపే అడుగులు వేశారు. 1953లో `పుట్టిల్లు` సినిమాతో ప్రారంభ‌మైన ఆయ‌న సినిమా కెరీర్ 2004లో న‌వ‌దీప్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `జై` సినిమాతో ముగిసింది. అందులో ఆయ‌న ఓ ముఖ్య పాత్ర పోషించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. దాదాపు వేయి చిత్రాల్లో అల్లు వారి హాస్యపుజల్లుతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు.

నేడు అల్లు వారి ఇల్లు ఎందరో నటులకు పుట్టినిల్లుగా మారింది. తెలుగునాట మరే హాస్యనటుడు చూడని వైభవాన్ని అల్లు రామలింగయ్య చూశారు. అల్లు కీర్తి కిరీటంలో ఎన్నో రతనాలు చేరాయి. హాస్య న‌టుడు రేలంగి తరువాత పద్మపురస్కారాన్ని అందుకున్న హాస్యనటునిగా అల్లు రామ‌లింగ‌య్య చ‌రిత్ర పుట్ట‌ల్లోకి ఎక్కారు. `రఘుపతి వెంకయ్య అవార్డు` కూడా ఆయన ప్రతిభను వెదుక్కుంటూ వెళ్ళింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts