"అల్లు" బ్రదర్స్ అదిరిపోయే షాపింగ్

0

Ramcharanఒక సినిమా మొదలయ్యే ముందు చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. టెక్నికల్ డిపార్ట్‌మెంట్ సంగతులు అటు ఉంచితే, హీరో హీరోయిన్‌లకి సంబంధించి కాస్ట్యూమ్స్ ఫైనల్ చేసుకోవడం అన్నది తలకి మించిన భారం. చాలామంది టాప్ హీరోలు- హీరోయిన్లు కొన్ని కాస్ట్యూమ్స్ విషయంలో అస్సలు రాజీ పడరు. కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్ తెచ్చిన దుస్తులు నచ్చకపోతే , షూటింగ్ క్యాన్సెల్ చేసిన సందర్భాలు అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో కోకొల్లలు.

ఇదిలా ఉండగా”రేసు గుర్ర్రం” సూపర్ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న బన్నీ త్వరలో ప్రారంభం కాబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రారంభం కావలిసిన ఈ సినిమా షూటింగ్ కధ విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో ఈ సినిమా మొదలు కావడం లేట్ అయింది. ఎట్టకేలకు కధ రెడీ కావడంతో త్రివిక్రమ్ ప్రస్తుతం నటీనటుల ఎంపిక విషయమై బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉండగా బన్నీ ఈ సినిమా కోసం తన తమ్ముడు అల్లు శిరీష్ ,స్టైలిస్ట్ అశ్విన్ తో కలిసి ఈ మధ్య దుబాయ్ కి వెళ్ళి ఈ సినిమా కోసం బోలెడు బట్టలు కోనేసాడట. లుక్ పరంగా ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించడం కోసం ఈ సినిమాలో తాను నటించే పాత్ర కోసం చాల జాగ్రత్తలు తీసుకుంటూ తాను వేసుకునే డ్రస్సులు అన్నీ ఈసారి ఇలా దుబాయ్ లో షాపింగ్ చేసాడట బన్నీ.

‘జులాయి’ సినిమా తరువాత త్రివిక్రమ్ బన్నీల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది కావడంతో ఈ సినిమా ప్రారంభం కాకుండానే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్న నేపధ్యంలో ఇప్పటికే ఖరారు అయిన సమంత, ఆదా శర్మలతో పాటు బాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నాను మూడవ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts