దిగొచ్చే వ‌ర‌కూ థియేట‌ర్లు బంద్ కొన‌సాగుతుంది: జెఏసీ చైర్మ‌న్ సురేష్ బాబు

0

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ రేపటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌ పాటించాలని ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ ( జెఏసీ) డి.సురే్ బాబు గురువారం మ‌ధ్నాహ్నం హైద‌రాబాద్ ఫిలిం ఛాంబార్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్లను బంద్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

ఐదు రాష్ట్రాల నిర్మాతల మండలి సంయుక్తంగా ఐకాస ఏర్పాటుచేసుకున్నామని ఆయన చెప్పారు. ఆంగ్ల సినిమాలకు వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు వసూలు చేయడంలేదని, డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు వీపీఎఫ్‌ తగ్గించట్లేదన్నారు. వీపీఎఫ్‌ ధరలు సున్నాచేయడంలేదని అన్నారు. వాటిని తగ్గించే వరకు థియేటర్ల బంద్‌ కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇందుకోసం ఐదు రాష్ట్రాల్లోని నిర్మాతలు, పంపిణీదారులు కూడా మద్దతు ఇచ్చారని తెలిపారు. డిజిట‌ల్ యాజ‌మాన్యాలు దిగొచ్చే వ‌ర‌కూ థియేట‌ర్ల‌ల‌లో సినిమా స్ర్కీనింగ్ ఉండ‌ద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసారు. ఈ స‌మావేశంలో జెఏసీ క‌న్వీన‌ర్ పి. కిర‌ణ్‌, తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ సెక్ర‌ట‌రీ ముత్యాల రామ‌దాసు, డిజిట‌ల్ క‌మిటీ చైర్మ‌న్ దామోద‌ర్ ప్ర‌సాద్, సి. క‌ల్యాణ్‌, తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ త‌రుపున కె. ముర‌ళీ మోహ‌న్, ఏషియ‌న్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్, ఆర్కే త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts