అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ నా !

0

akhil-akkineniఅక్కినేని నటవారసత్వం పుణికి పుచ్చుకున్న మరో హీరో అఖిల్. ప్రస్తుతం అఖిల్ మూవీ ఎంట్రీపై పరిశ్రమ ఎంతో ఆసక్తి చూపిస్తుంది. అలాగే అక్కినేని అభిమానులు సైతం అఖిల్ ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుందో అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. తాజాగా మనం సినిమాలో తళుక్కున కనిపించిన అఖిల్ , విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ రెస్పాన్స్ చూసిన నాగార్జున , అఖిల్ డెబ్యూ ఫిల్మ్ కచ్చితంగా గ్రాండ్ సక్సెస్ ని సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ ఎంట్రీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కంప్లీట్ కాబోతున్నది. ఇదిలా ఉంటె , అఖిల్ కేవలం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం చేయకుండా బిటౌన్ లో తను నిరూపించుకునేందుకు నాగార్జున ప్లాన్స్ వేస్తున్నాడు. అఖిల్ ని చూసిన బిగ్ బి , బిటౌన్ లో తన అప్ కమింగ్ ఫిల్మ్ లో ఓ పాత్రకి రికమెండ్ చేస్తానని నాగార్జునకి చెప్పాడట. అమితాబ్ బచ్చన్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ అఖిల్ నటిస్తాడంటూ టాలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమా టాలీవుడ్ సినిమా కంటే ముందుగానే ఉంటుందా ? తర్వాత ఉంటుందా ? వంటి విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తంగా అయితే , అఖిల్ మాత్రం బిటౌన్ నటించడం ఖాయం అని అంటున్నారు. ఒకవేళ బిటౌన్ కనుక అఖిల్ హిట్ అయితే , టాలీవుడ్ లో తక్కువ సినిమాలు చేసుకుంటూ ఎక్కువ సినిమాలు బిటౌన్ లో చేయాలనీ అఖిల్ కోరుకుంటున్నాడట.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts