`వివేకం` ఆడియో విడుద‌ల‌

0

vivekam

త‌మిళ స్టార్ హీరో అజిత్ క‌థానాయ‌కుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, అక్ష‌ర హాస‌న్ హీరోయిన్స్‌. ర‌క్త‌చ‌రిత్ర చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబ్‌రాయ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. హీరో అజిత్ అంటే ఇటు యూత్, మాస్‌, క్లాస్ ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. హీరో అజిత్ `వివేకం` చిత్రంతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించనున్నారు. శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న`వివేగం` చిత్రాన్ని వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్‌ శొంఠినేని తెలుగు ప్రేక్ష‌కుల‌కు `వివేకం` పేరుతో అందిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్ర‌న్ సంగీత సారథ్యం వ‌హించిన ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుద‌లైంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ మాట్లాడుతూ – “అజిత్‌గారితో నేను చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. జేమ్స్ బాండ్ మూవీలా స్టైలిష్‌గా ఉంటుంది. అలాగే అజిత్‌గారిని ఆయ‌న అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలాంటి మూవీ. అజిత్‌గారి లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే విడుద‌లైన టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. సినిమాను ఆగ‌స్ట్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. అనిరుధ్‌గారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుంది“ అన్నారు.

చిత్ర నిర్మాత‌ న‌వీన్‌ మాట్లాడుతూ – “భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన అజిత్‌గారి వివేకం సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. చాలా స్టైలిష్ మూవీ. పాట‌లు మార్కెట్లోకి విడుద‌ల‌య్యాయి. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇటీవ‌ల తెలుగులో విడుద‌ల సినిమా టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాను ఆగ‌స్ట్ 24న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నాం. త‌ప్ప‌కుండా స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అంద‌రిన్నీ మెప్పించే చిత్రంగా మా బ్యాన‌ర్‌కు మంచి తెస్తుంది“ అన్నారు.

ఈ కార్యక్రమంలో త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, వెట్రి, మహేశ్వర్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
powered by RelatedPosts