Aadi “Chuttalabbai” Working Stills On Set.

0

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ మార్చి 1 నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ – ”ఇటీవల మా చిత్రంలోని ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని బ్యాంకాక్‌లో శేఖర్‌ మాస్టర్‌ సారధ్యంలో 5 రోజులపాటు చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు మార్చి 1 నుంచి తాజా షెడ్యూల్‌ రాజమండ్రిలో ప్రారంభమవుతోంది. మార్చి 20 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది” అన్నారు.
దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ – ”మార్చి 1 నుంచి జరిగే తాజా షెడ్యూల్‌ను రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరుగుతుంది. ఆది, నమిత ప్రమోద్‌ మరియు విలన్‌ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్‌లో ఒక పాటను, ఫైట్‌ను కూడా షూట్‌ చెయ్యబోతున్నాం. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్ తాళ్ళూరి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.

DSC_8053 DSC_8385 DSC_7513 DSC_6616 DSC_6433 DSC_4267

 

 

 

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts