అతనితో అయితే పవన్‌ ఎప్పుడూ రెడీగా ఉంటాడు?

0

pawan-kalyan-ganesh-babu-piసినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ పిచ్చెక్కిస్తాయి అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. నిజమే మరి, ప్రస్తుతం అలాంటి సూపర్ కాంబినేషంలో ఒక సినిమా వచ్చే అవకాశం ఉందట. ఇంతకీ విషయం ఏమిటి అంటే, ‘తీన్‌మార్‌’ నిరాశపర్చినా, ‘గబ్బర్‌సింగ్‌’తో బంపర్‌ హిట్‌ కొట్టిన ‘పవర్‌ఫుల్‌’ ప్రొడ్యూసర్‌ బండ్ల గణేష్‌కి పవన్‌కళ్యాణ్‌ దేవుడని అందరికీ తెలుసు. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా పవన్‌కళ్యాణ్‌ని ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ సినిమా ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌లో ‘దేవుడు’ అనేశాడు. ‘అమ్మనీ దేవుడ్నీ..’ అని తన సినిమాలోని డైలాగ్‌నే త్రివిక్రమ్‌ చెప్పినా, పవన్‌ మీద తనకున్న అభిమానాన్ని త్రివిక్రమ్‌ అలా చాటుకున్నాడని అందరికీ అర్థమైంది. ఈ ఇద్దరు భక్తులూ కలవనున్నారనీ, పవన్‌కళ్యాణ్‌ చేయబోయే సినిమాకి ఈ కాంబినేషన్‌ సెట్‌ అవనుందనీ అని టాలీవులో ఓ కొత్త గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. పవన్‌కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌-2’ సినిమా చెయ్యాలి, ఆ తర్వాత దాసరి నారాయణరావు నిర్మించే సినిమా చేయాల్సి ఉంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా ఖాళీగా ఏం లేడు.

రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కొదవా అన్నట్టు, బండ్ల గణేష్‌ తలచుకుంటే ఏ కాంబినేషన్‌ అయినా ఈజీగా సెట్‌ అయిపోతుంది. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకొచ్చి, స్టార్‌ ప్రొడ్యూసర్‌గా మారిన బండ్ల గణేష్‌ ఎవరి ఊహలకూ అందని రీతిలో కాంబినేషన్స్‌ సెట్‌ చేస్తాడు. గణేష్‌ అడిగితే పవన్‌ కాదనడు. త్రివిక్రమ్‌తో సినిమా అంటే పవన్‌ ఎప్పుడూ రెడీగా ఉంటాడు. త్రివిక్రమ్‌ కూడా అంతే. ఇంకేముంది ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా అతి త్వరలో అనౌన్స్‌ అయినా ఆశ్చర్యమేమీ ఉండదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts