
మాస్ మహరాజా రవితేజ, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు పతాకంపై డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో డేరింగ్ ప్రొడ్యూసర్ వై.వి.ఎస్.చౌదరి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘నిప్పు’ సెన్సార్ పూర్తిచేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న మహాశివరాత్రి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వైవిఎస్ చైదరి మాట్లాడుతూ ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే అందరి ఆదరణ పొందాయి. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్స్‌కి కూడా ఎక్స్‌ట్రార్డనరీగా రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. రవితేజ, దీక్షాసేథ్, డా.రాజేంద్రప్రసాద్, ప్రదీప్‌రావత్, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్‌దేవ్, బ్రహ్మాజీ, సుప్రీత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఆకుల శివ, శ్రీధర్ సీపన, సంగీతం: థమన్, సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎడిటింగ్: గౌతంరాజు, ఫైట్స్: కనల్‌కణ్ణన్, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, గణేష్ తరుపాయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ఆర్.కిషోర్, కో-ప్రొడ్యూసర్స్: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వైవిఎస్.చౌదరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:గుణశేఖర్.







