భారతరత్నకు ఎ.యన్.ఆర్.ఇంటర్నేషనల్ అవార్డు
Mon, Feb 1 2010ప్రపంచానికి భారతదేశ సంగీతాన్ని తెలియజేసిన, భారతదేశం గర్వించతగ్గ గాయనీమణి, భారత రత్న, డాక్టర్ లతామంగేష్కర్ గారికి అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానోత్సవం, ఫిబ్రవరి ఒకటవ తేదీన తాజ్ క్రిష్ణా హోటల్లో ఘనంగా జరిగింది.ఈ ఆవార్డు ప్రదానోత్సవానికి మనరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య, కేంద్రమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్, అక్కినే నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ అవార్డు కమిటీ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి, వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని, తదీతరులు హాజరయ్యారు. నాగార్జున శ్రీమతి అమల ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అక్కినేని ప్రసంగిస్తూ లతామంగేష్కర్ గొప్పతనాన్ని చెప్పి, ఆమెకీ అవార్డునందించటం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.టి.సుబ్బిరామిరెడ్డి ప్రసంగిస్తూ కోహినూర్ వజ్రానికి తరతరాలకు తరగని ఎలాంటి ఖ్యాతి ఉన్నదో లతా మంగేష్కర గారికి కూడా అలాంటి కీర్తే ఉన్నదని అంటూ ఆమెకు నీటితో నిండి ఉన్న శివలింగాన్ని బహూకరించారు.అనంతరం అక్కినేని చేతుల మీదుగా లతామంగేష్కర్ కు సత్కారం జరుగగా, ఆయన పెద్ద కోడలు అక్కినేని జ్యోత్స్న , ఆయన కుమార్తె నాగసుశీల సాంప్రదాయ రీతిలో లతాజీకి బొట్టుపెట్టారు.సి.యం.రోశయ్యగారు లతాజీని దుశ్శాలువతో సత్కరించగా, టి.సుబ్బిరామిరెడ్డి అక్కినేని అవార్డుని లతాజీకి బహూకరించారు.ఆ అవార్డు తాలూకు నాలుగు లక్షల చెక్కుని వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని లతాజీకి అందజేశారు. చక్కటి గ్నాపికను విలాస్ రావ్ దేశ్ ముఖ్ లతాజీకి అందజేశారు. బి.హెచ్.ఇ.ఎల్. చైర్మన్ మిస్టర్ రావ్ వరదబాధితుల సహాయార్థం ముఖ్య్మంత్రి సహాయనిధికి అందజేస్తామన్న 5 కోట్ల రూపాయల్లో, తొలి వాయిదా 2,50 కోట్లను చెక్కు రూపంలో రోశయ్యగారికి విఒలాస్ రావ్ దేశ్ ముఖ్ చేతుల మీదుగా అందజేశారు.
విలాస్ రావ్ దేశ్ ముఖ్ ప్రసంగిస్తూ లతాజీ తనకు సోదరి వంటిదనీ ప్రతిరోజూ తన ఉదయం ఆమె పాటతోనే మొదలవుతుందనీ,సంగీత ప్రపంచంలో ఆమెది ఒక చరిత్ర అనీ,జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ, భారతరాష్ట్రపతి అందించే అత్యున్నత భారతరత్న అవార్డులు వంటివెన్నో ఆమె మీద వర్షించాయనీ, వాటిటో పాటు ఈ అవార్దు కూడా రావటం ఆనందించతగ్గ విషయమనీ అన్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని మన్నవరం గ్రామం వద్ద బి.హె.ఇ.ఎల్, కంపెనీ యన్.టి.పి.సి.తో కలసి ఏర్పాటుచేసే భారీపరిశ్రమను త్వరలోనే ప్రారంభిస్తామనీ కూడా ఆయన అన్నారు.
అవార్డు గ్రహీత లతామంగేష్కర్ ప్రసంగిస్తూ ఒక మహా కళాకారుడు అక్కినేని అవార్డు నాకు రావటం చాలా ఆనందంగా ఉంది. అందుకు వారికి నేను సదా క్రుతగ్నురాలిని.నిన్న రాత్రే చెప్పాను. నా బాల్యంలో సైగల్ గారి దేవదాసు చూశాను. నాకు భాష రాకపోయినా అక్కినేని గారి దేవదాసుని అనేకసార్లు చూశాను. భాష రాకపోయినా నాకు అక్కడేం జరుగుతుందో భావం అర్థం అవుతుంది. దక్షిణాదిలో సుసర్ల దక్షిణామూర్తిగారి సంగీత దర్శకత్వంలో ఒక పాట పాడాను. పి.సుశీల నాకు సోదరి వంటిది ఆమె పాట నాకు చాలా ఇష్టం.ఇక్కడుంటే నాకు మహారాష్ట్రలో ఉన్నట్లే ఉంది. కట్టుబొట్టు, ఆహారపు అలవాట్లు చాలా కలుస్తాయి అక్కడికీ, ఇక్కడికీ.విలాస్ రావ్ దేశ్ ముఖ్ నా సోదరసమానుడు. ఆయన నన్నెంతగానో అభిమానిస్తారు. ఆయన్ కూడా ఈ సభలో ఉండటం నాకు చాలా ఆనందంగాఉంది.
శ్రీ రోశయ్య మాట్లాడుతూ యాచకో యాచక శత్రుహు.అని మనకో సామెతుంది. ఒక మహా కాళాకారుడు నాగేశ్వరరావుగారు మరో మహా సంగీత కళాకారిణి లతామంగేష్కర్ ని ఈ అవార్డు ద్వారా గౌరవించటం ముదావహం.గత మూడు రోజులుగా లతాజీ పాల్గొన్న కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనటం ఆనందంగా ఉంది.ఈ సందర్భంగా విలాస్ రావ్ గారు మనకు రెండు వరాలిచ్చారు. ఒకటి 5 కోట్లు వరదబాధితుల సహానిధికి, మరోకటి శ్రీకాళహస్తి వద్ద భారీ పరిశ్రమను స్థాపిస్తానని హామీఈవ్వటం. ఈ సభ ఒక మధుర స్మ్రుతిగా మిగిలిపోతుంది."అని అన్నారు. అనత్రం అక్కినేని వందన సమర్పణ చేశారు.




