11 ఏళ్ల వయసులో…!

0

tamanna-bhatia-22-vఎవరితో సినిమా చేస్తే వారిని కథానాయికలు పొగడ్తల్లో ముంచేస్తుంటారు. ఇందుకు నేనూ మినహాయింపు కాదని తమన్నా నిరూపిస్తోంది. హిమ్మత్‌వాలా చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ మిల్కీవైట్ బ్యూటీ ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఆయన హీరోగా రూపొందుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంలో తమన్నా నటిస్తోంది. ఇటీవల విడుదలైన హమ్‌శకల్స్ కూడా పరాజయం కావడంతో ఈ మిల్కీవైట్ బ్యూటీ ఎంటర్‌టైన్‌మెంట్‌పైనే భారీ అంచనాలు పెట్టుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ అక్షయ్‌కుమార్ అంటే 11 ఏళ్ల వయసులో ఇష్టం ఏర్పడింది.

ధడ్కన్ సినిమా చూసి నేను ఆయన ఫ్యాన్ అయిపోయాను. సంగీత ప్రధాన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఏ స్థాయి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. అప్పటి నుంచే అక్షయ్‌ని కలవాలని ఎదురు చూశాను. ఇప్పటికి ఆయన్ని కలవగలిగాను. ప్రస్తుతం అక్షయ్‌తో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేస్తుండటం ఆనందంగా వుంది. కామెడీని పండించడంలో అక్షయ్‌ది వినూత్నశైలి. ఆయన ఈ చిత్రంలో తనదైన మార్కు హాస్యంతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లో విజయాల బాటపడతాను అని తెలిపింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫిబ్రవరి 25న 'కణం` తొలి సింగిల్‌
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. 'ఛలో' తర్వాత నా...
`కాలా` టీజ‌ర్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ టీజర్‌పై సస్పెన్స్ వీడింది. ఎప్పడు రిలీజ్ చేస్తారా..? అని ఎదురు చూసిన అభిమాలను ఆ చిత్ర యూనిట్ శుభవార్త తె...
మార్చి 9న విజయ్ మంత్రం వేస్తాడా?
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో వ...
powered by RelatedPosts