సెన్సార్ దాటిన ‘నిప్పు’

మాస్‌ మహరాజా రవితేజ, దీక్షాసేథ్‌ హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు పతాకంపై డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ వై.వి.ఎస్‌.చౌదరి నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నిప్పు’ సెన్సార్‌ పూర్తిచేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న మహాశివరాత్రి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వైవిఎస్‌ చైదరి మాట్లాడుతూ ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే అందరి ఆదరణ పొందాయి. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్స్‌కి కూడా ఎక్స్‌ట్రార్డనరీగా రెస్పాన్స్‌ వచ్చింది.

ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. రవితేజ, దీక్షాసేథ్‌, డా.రాజేంద్రప్రసాద్‌, ప్రదీప్‌రావత్‌, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్‌దేవ్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఆకుల శివ, శ్రీధర్‌ సీపన, సంగీతం: థమన్‌, సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: కనల్‌కణ్ణన్‌, డ్యాన్స్‌: రాజు సుందరం, బృంద, గణేష్‌ తరుపాయ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌.కిషోర్‌, కో-ప్రొడ్యూసర్స్‌: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వైవిఎస్‌.చౌదరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:గుణశేఖర్‌.

Rate this post

Disclaimer: MS publishes news, truth, rumors and speculation. This website may contain errors or inaccuracies, however we do our best to verify all stories and submissions. We make no warranty as to the correctness or reliability of the content.


Comments are closed.

>