హేమమాలిని కూతురిగా..

0

Rakul Preeth Singh (25)చిత్ర పరిశ్రమలో ఒక్క విజయం తారల జీవితాల్ని పూర్తిగా మార్చివేస్తుంది. అప్పటి వరకూ అవకాశాల కోసం ఎదురుచూసిన వారిని ఒక్కసారిగా అందలమెక్కిస్తుంది. ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. 2009లో వచ్చిన కన్నడ చిత్రం గిల్లీ ద్వారా కథానాయికగా అరంగేట్రం చేసింది ఈ సుందరి. ఈ సినిమా పరాజయాన్ని చవిచూడటంతో దాదాపు మూడేళ్లపాటు సినిమాలకు దూరమైంది. ఇటీవలే తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో కథానాయికగా తళుక్కున మెరిసిన ఈ భామ ఈ సినిమా అనుహ్య విజయంతో ఒక్కసారిగా లక్కీస్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో గ్లామర్, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికల్లో ఒకరిగా మారిపోయింది.

తెలుగులో ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఈ సుందరి తాజాగా బాలీవుడ్ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. షోలే చిత్ర దర్శకుడు రమేష్ సిప్పీ షిమ్లా మిర్చీ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హేమమాలిని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్లు సమాచారం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హేమమాలిని కూతురి పాత్రలో ఆమె నటించబోతున్నట్లు తెలిసింది. కథానుగుణంగా కొత్త నాయిక అయితేనే బాగుంటుందని భావించిన దర్శకుడు రమేష్ సిప్పీ రకుల్ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. రాజ్‌కుమార్ రావ్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానున్నట్లు ముంబై చిత్ర వర్గాల సమాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

రా..రా ప్రీ రిలీజ్ వేడుక‌
శ్రీకాంత్ , నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రా రా’. . శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి...
ఫేమ‌స్ హాలీవుడ్ జంట.. విడాకుల బాట‌!
హాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పెటాకులయ్యింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న జెనిఫర్ అనిస్టన్, జస్టిన్ థెరోక్స్ విడిపోయారు. 2015 ఆగస్టులో వారిద్దర...
టాలీవుడ్ లో ప్రియ ఫీవ‌ర్...రైట్స్ రెండు కోట్లు
ప్రియా ప్రకాశ్ వారియర్ అంటే ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నం. 20 సెకన్లలో ఆమె పలికించిన హావభావాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇంటర్నెట్‌లో అమ్మ‌డి...
powered by RelatedPosts