హీరో నిఖిల్ చేతుల మీదుగా ‘దృశ్యకావ్యం’ ట్రైలర్ విడుదల

0

hero nikhil 1

రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ సినిమా ట్రైలర్ ను హీరో నిఖిల్ మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..
నిఖిల్ మాట్లాడుతూ.. ”రామకృష్ణ గారి లాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తులు ఇండస్ట్రీకు ఎంతో అవసరం. సినిమా ట్రైలర్ చాలా బావుంది. చూడడానికి కొత్తగా అనిపించింది. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. మార్చి 18న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
దర్శకుడు రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ”ఇది నా మొదటి సినిమా. సినిమాలో ప్రతి సీన్ అందరికి నచ్చేలా జాగ్రత్తగా తీశాం. అందరు మనసుపెట్టి చేయడం వలనే దృశ్య కావ్యమయింది. ఇదొక ఎమోషనల్ లవ్ స్టొరీ. సరికొత్త కథాంశంతో, ఉత్కంట భరితంగా సాగుతుంది. కమలాఖర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మార్చి 18న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అని చెప్పారు.
సంగీత దర్శకుడు కమలాఖర్ మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఒక్క ఫైట్, ఐటెం సాంగ్ లేకపోవడం. రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం కాదు. మంచి సినిమా తీశారు. ‘ఏ కలవో’ అనే పాట మంచి మెలోడియస్ సాంగ్ గా నిలిచిపోతుంది” అని చెప్పారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ”ఇదొక లవ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దృశ్యకావ్యం వినడానికి ఎంత బావుందో.. చూడడానికి ఇంకా బావుంటుంది. కమలాఖర్ గారి మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్” అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కశ్మీరా కులకర్ణి, రచ్చ రవి, మధునందన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి, మధునందన్, అలీ, పృథ్వి, సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కమలాఖర్, కెమెరామెన్: సంతోష్ శానమోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లు శివనాగేంద్రరావు, సమర్పణ: శ్రీమతి బెల్లం సుధా రెడ్డి, ఎడిటర్: వి.నాగిరెడ్డి, నిర్మాణం: పుష్యమి ఫిలిం మేకర్స్, దర్శకుడు: బెల్లం రామకృష్ణా రెడ్డి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts