హీరో గారి గూడు చెదిరింది

0

Actor_Danushఒక పక్క ఆట్టహాసంగ జన్మదిన వేడుకలు, మరోపక్క స్వీయ నిర్మాణంలో హీరోగా చేసిన “వేలై ఇల్లా” చిత్రం ఘనవిజయం సాధించిన సదర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. అంతలోనే తమిళ హీరో ధనుష్ కి విషాద వార్త. ఎంతో ఇష్టపడి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ,ఎన్నో హంగులని కూర్చి కట్టించుకుంటున్న ఇల్లుని అధికారులు కూల్చేశారు. ధనుష్ కొవై జిల్లా వైదేహి నీర్ విళిచ్చి సమీపంలో అధునాతన వసతులతో ఒక భవనాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఆ భవనం అటవీ శాఖ పరిధిలో ఉండటం వల్ల వారి అనుమతి లేకుండా నిర్మించినట్లు ఫిర్యాదు రావటంతో కోవై జిల్లా అధికారులు భవనాన్ని కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో ధనుష్ భవనం కూల్చివేతకు గురైంది. ఒక పక్క పుట్టినరోజు వేడుకలతో (మంగళవారం పుట్టినరోజు) మరోపక్క నిర్మించి, హీరోగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టదారి విజయం సాధించిన ఆనందంలో ఉన్న ధనుష్ కు ఈ సంఘటన ఆవేదన కలిగించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై అతను స్పందించలేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
powered by RelatedPosts