హీరోని లాగి ఒక్కటిచ్చి.. రక్కింది..!!

0

nayanthara-new-movie-mandodari1“మీడియా వాళ్ళకి కోడిగుడ్డు దొరికినా చాలు….దాని మీద కూడా ఈకలు పీకుతారు “అని మీడియా అంటే పడని వాళ్ళు అంటూ ఉంటారు. అందులో నిజానిజాలు ఎంతున్నా, కొంత మేరకు పోలిక ఉంది అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే, ఏమీ లేని దానని ఎంతో ఉన్నట్టుగా చిలవలు పలవలు చేసి చెప్పడం మీడియాకే చెల్లుతుంది. అందుకు అడ్డం పట్టేదే ఈ వార్త. మీరూ చదవండి.

తెల్లవారితే చాలు ఎప్పుడూ నయనతార పై ఎదో ఒక సంచలన వార్త వ్రాయనిదే కోలీవుడ్ మీడియాకు గడవదు. ఈ నేపధ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనుమడు, తమిళ యువహీరో ఉదయనిధి స్టాలెన్‌ని నయనతార చెంప చెళ్ళు మనిపించి ఆసుపత్రిపాలు చేసింది అని కోలీవుడ్ మీడియాలో వచ్చిన వార్తలు సంచలనాన్ని సృస్టించాయి. నయనతార ఉదయనిధి స్టాలిన్ కలిసి నటిస్తున్న ‘నన్బేన్డా’ సినిమాలో ఉదయనిది నయన్ కు ప్రేమ ప్రతిపాదన చేశాడనీ అయితే ఆ ప్రతిపాదన నయనతార కాదనడంతో ఉదయనిది ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ అంటూ కోలీవుడ్ మీడియా కధనాలు మొదలు పెట్టింది. అయితే ఈ వార్తలను చూసిన ఉదయనిధి వెంటనే స్పందించి అసలు విషయం బయట పెట్టాడు.

తాము ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమాలోని ఒక షాట్ లో నయన్, ఉదయనిది దొర్లు కుంటూ వెళుతూ, ఆ తరువాత నయన్ లేచి అక్కడే ఉన్న ప్రతినాయకుడి చెంప ఛెళ్లుమనిపించే సీన్ ఉంటుందట. అయితే కంగారులో విలన్‌ను కొట్టబోయి పొరపాటున తన చెంప నయన్ ఛెళ్లుమనిపించడంతో నయన్ చేతి గోళ్ళ వల్ల తన కంటికి బలమైన గాయం అయింది అంటూ ప్రస్ నోట్ ఇచ్చుకున్నాడు ఉదయనిది స్టాలిన్. ఏమైనా హీరోను ఆసుపత్రి బెడ్ ఎక్కించిన హీరోయిన్ గా నయనతార రికార్డు క్రియేట్ చేసింది.

ఇంకా నయం….. హత్యా ప్రయత్నం అనలేదు…. !!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts