హిమాచల్ బాధితులకి బాహుబలి సంతాపం

0

Baahubali_posterమనిషి మొరటుగానే ఉంటాడు కానీ, మనసు వెన్న అని ప్రభాస్ ట్విట్టర్ లో తాజాగా చేసిన ట్వీట్ని చూస్తే చెప్పొచ్చు .
హిమాచల్ ప్రదేశ్లో డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో మన రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళను విషాదంలోకి నెట్టడమే కాకుండా ఎంతో మంది తల్లిదండ్రులకు గర్భ కోశాన్ని మిగిల్చింది. అయితే ఎప్పుడూ ట్విట్టర్లో నానా యాగీ చేసే మన హీరోలు ఎవ్వరూ ఈ ఘటన మీద స్పందించలేదు. కాని మన టాలీవుడ్ బాహుబలుడు ప్రభాస్ మాత్రం సోషల్ మీడియాలో నిన్న చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు సంతాపాన్ని తెలియజేశాడు.

ఘటన జరిగిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ప్రభాస్ “24 మంది విద్యార్థులు ఇలా అర్థాంతరంగా తనువు చాలించారనే వార్త మనసుకి చాలా బాధ కలిగించిందని ఫేస్ బుక్ వేదికగా అభిప్రాయపడ్డాడు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్నితెలియజేశాడు.

అయితే ఘటనలో చనిపోయిన విద్యార్ధుల్లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేషుకు చెందిన వారు ఉండటంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం చీకటిపడే సమయానికి ఆరు మృతదేహాలని వెలికితీశారు.మరొక వైపు 22మంది విద్యార్థుల బృందాన్ని రెండువిమానాల్లో తిరిగి హైదరాబాద్ పంపించారు అధికారులు.

సమాజానికి ఎంతో చేయగల స్థితిలో ఉన్న ఇలాంటి సెలెబ్రిటీలు కేవలం సంతాప సందేశాలకే పరిమితం అవకుండా, ప్రత్యక్షంగా కూడా ఏదైనా చేయగలిగితే బాగుంటుంది .

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts