హాలీవుడ్ వైపు దన్సిక చూపు?

0

15అందాల ముద్దుగుమ్మ ,నటి దన్సిక ప్రస్తుతం హాలీవుడ్‌కు బాటలు వేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉంది అని తెలుస్తోంది. ” పరదేశి ” వంటి చిత్రాల్లో తన నటనా ప్రతిభను నిరూపించుకున్న ఈ భామ ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉంది. త్వరలో తమిళం, తెలుగు, కన్నడం మొదలగు మూడు భాషల్లో తెరకెక్కనున్న చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దీని గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ ప్రస్తుతం తమిళంలో మంచి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పింది. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాల వివరాలు తెలుపుతూ విళిత్తురు చిత్ర షూటింగ్ పూర్తయిందని తెలిపింది. ఇందులో తాను స్లమ్ ఏరియా అమ్మాయిగా నటించానని చెప్పింది. తిరందిరుసిసే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపింది. ఇది ఒక క్లబ్‌లో జరిగే కథా చిత్రం అని పేర్కొంది.
ఇక కాత్తాడి చిత్రంలో యాక్షన్ హీరోయిన్‌గా అవతారమెత్తుతున్నానని వెల్లడించింది. తదుపరి సముద్రకని దర్శకత్వంలో రూపొందనున్న త్రిభాషా (తమిళం, తెలుగు, కన్నడం) చిత్రం కిట్టా చిత్రంలో నటించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో నాలుగు గెటప్‌ల్లో కనిపించనున్నట్లు చెప్పింది. అదేవిధంగా ఛాయా గ్రాహకుడు డేని దర్శకత్వంలో మాల్ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపింది. ఈ చిత్రం తెలుగులో కూడా తెరకెక్కనుందని వెల్లడించింది. అదే విధంగా త్వరలో ఒక హాలీవుడ్ చిత్రంలోనూ నటించనున్నట్లు, ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని ఆమె వివరించింది. తానిప్పుడు పలు చిత్రాల్లో నటిస్తున్నా కాల్‌షీట్స్, సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నట్లు భామ దన్సిక చెప్పింది.

అది సరెకానీ, ఇప్పుడిప్పుడే కాస్త బిజీ అవుతున్న దశలో, ఇండియన్ సినిమాని వదిలేసి హాలీవుడ్ కి చెక్కేస్తే, అమ్మడికి అక్కడ చుక్కెదురైతే ఏంటి పరిస్థితి…పాప కాస్త తొందరపడుతోంది అని అనేవారూ లేకపోలేదు. మరి మీరేమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts