స్టంట్ మాస్టర్ కి షాకిచ్చిన సూపర్‌స్టార్

0

rajinikanth_3004పని పట్ల నిబద్ధత , వృత్తి పట్ల అంకితభావం గురించి మాట్లాడాలి అంటే, ఎవరినైనా ఉదాహరణకి చూపించాలి అంటే తడుముకోకుండా చెప్పుకోదగ్గ పేరు సూపర్‌స్టార్ రజనీకాంత్. అరవై నాలుగేళ్ళ వయసులో కూడా రజనీకాంత్ తన సాహసాలతో ఇప్పటికీ తొలి సినిమాలో కష్టపడి పనిచేసినట్టే కష్టపడుతూ ఉండటం, ఎంతో మంది యువ హీరోలకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందరికో ఇన్‌స్పిరేషన్ గా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు.

తాజాగా తన అసామాన్యమైన పట్టుదలతో, చిత్తశుద్ధితో ,కష్టంతో రజనీకాంత్ ఒక హూలీవుడ్ స్టంట్ మాస్టర్ కు షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న ‘లింగా’ సినిమా షూటింగ్ లో ఈ సంఘటన జరిగింది. తన 63వ వయస్సులో కూడ రజినీ చేసిన రిస్కీ యాక్షన్ సన్నివేసాలు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రజనీకాంత్ సినిమాలంటే ఫైట్స్ కాస్త డిఫరెంట్‌గా వుంటాయి అన్న విషయం అందరికి తెలిసిందే. ఆ ఫైట్స్ లేనిదే రజినీ అభిమానులు ధియేటర్లలో కూర్చోరు. దీనికోసం ‘లింగా’లో కనివినీ ఎరుగని రీతిలో యాక్షన్ దృశ్యాలు వుండబోతున్నాయట. దీనికి సంబంధించి రిహార్సల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ విషయాన్ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్ లీ విట్టేకార్ తన ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

డెవిల్ యాక్షన్ సీన్స్‌ని తానెప్పుడూ డిజైన్ చేయలేదని ఇందుకోసం 4 కె హైస్పీడ్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఇటువంటి రిస్కీ ఫైట్స్ చేయడానికి ముందుకు వచ్చిన రజినీ ధైర్యాన్ని వివరించడానికి తన వద్ద మాటలు లేవు అని అంటున్నాడు విట్టేకార్. గతంలో కమల్‌హాసన్ ‘విశ్వరూపం’, అజిత్ ‘ఆరంభం’ వంటి సినిమాలకు మాత్రమే పనిచేసిన విట్టేకార్ రజినీ ‘లింగా’ కోసం డిజైన్ చేస్తున్న ఫైట్స్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. దీపావళికి ఈ సినిమా ఆడియోను, రజనీకాంత్ బర్త్‌డే డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ ను నిర్మాత లు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. రజినీ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చేస్తున్న ఈ సాహసం ‘లింగా’ కు హాట్ టాపిక్ గా మారింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts