సైఫ్ పద్మశ్రీని వెనక్కి లాక్కుంటారట

0

saifపేరు ముందు “పద్మశ్రీ”లు తగిలించుకొగానే సరిపోదు..ఆ అవార్డుకి వన్నె తెచ్చేలా మన ప్రవర్తన ఉండాలి. “పద్మశ్రీ” అనేది దేశం మనకి ఇచ్చే అత్యున్నతమైన గౌరవాల్లో ఒకటి. మరి అంతటి బాధ్యతని మరచిపోయి ఇష్టానుసారం ఉంటాం అంటే కుదరదు కదా? అదీ సినిమా వాళ్ల లాంటి పబ్లిక్ ఫిగర్లకి అస్సలు కుదరదు. అందుకు,తాజా ఉదాహరణ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.

ఎస్.సి అగర్వాల్ అనే ఆర్టీఐ కార్యకర్త 2010లో సైఫ్కు బహూకరించిన ఈ “పద్మశ్రీ” అవార్డును రద్దు చేయాలని కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.

ఓ రెస్టాంట్లో గొడవపడిన కేసులో సైఫ్పై చార్జిషీటు నమోదు చేయాలని ముంబై కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అగర్వాల్ ఈ డిమాండ్ చేశారు. తన ఫిర్యాదు చేసిన అంశం ఏ దశలో ఉందో తెలిపాలని అగర్వాల్ మరోసారి కేంద్రాన్ని కోరారు. సైఫ్కిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కు తీసుకునే విషయం పరిశీలనలో ఉందని కేంద్రం బదులిచ్చింది. 2012లో ఓ రెస్టారెంట్లో సైఫ్ తన స్నేహితులతో కలసి దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యాపారవేత్త, ఆయన బంధువుపై దాడి చేసినట్టు కేసు నమోదైంది. ఇపప్తీకే వివిధ కారణాల చేత మోహన్‌బాబు, బ్రహ్మానందం విషయంలో ఇలాంటి చూశాం. ఇప్పుడు సైఫ్ వంతు. … సైఫ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts