సెకండ్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం

0

Trisha-Latest-Photos-1547చిత్రసీమలో స్టార్‌డమ్ శాశ్వతం కాదు. ఒకప్పుడు వరుస విజయాలతో తారాపథంలో దూసుకెళ్లిన చెన్నై సొగసరి త్రిష ప్రస్తుతం కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి సతమతమవుతోంది. దమ్ము తర్వాత ఆమె తెలుగు సినీరంగానికి పూర్తిగా దూరమైపోయింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ సుందరి తెలుగు సినిమాకోసం ముఖానికి మేకప్ వేసుకోనుంది. వివరాల్లోకి వెళితే…బాలకష్ణ కథానాయకుడిగా నూతన దర్శకుడు సత్యదేవ్ రూపొందిస్తున్న తాజా చిత్రంలో త్రిష కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభంకానుంది.

ఇందులో త్రిషపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. రెండేళ్ల విరామం తర్వాత తెలుగు చిత్రంలో నటించడం ఆనందంగా వుందని, తన సక్సెస్‌ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఈ సినిమా బాటలు వేస్తుందని ఆనందం వ్యక్తం చేస్తోంది త్రిష. యువహీరోలు ఈ సుందరి సరసన నటించడానికి సుముఖంగా లేకపోవడంతో సీనియర్ హీరోల చిత్రాలపై ఆమె దష్టిపెడుతోందని సినీవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం త్రిష తమిళంలో అజిత్ సరసన తల 55, కన్నడంలో పవర్ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మరో చిత్రం కథాచర్చల్లో వున్నట్లు తెలిసింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts