సెంచరీ కొట్టాడు!

0

balakrishnalegendlateststills (1)లెజెండ్ సినిమాతో ఈ ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలకష్ణ. వారాహి చలనచిత్రం సమర్పణలో 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ చిత్రం నేటితో 31 కేంద్రాలలో శతదినోత్సవాన్ని పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ సింహాలాంటి విజయవంతమైన చిత్రం తర్వాత బాలకష్ణ-బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సష్టిస్తోంది. బాలకష్ణ నటన, బోయపాటి పవర్‌ఫుల్ సంభాషణలు చిత్ర విజయంలో కీలక భూమిక పోషించాయి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా జగపతిబాబు అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అశేష ప్రేక్షకాదరణతో ఈ చిత్రం శతదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా వుంది. ఈ చిత్రానికి అపూర్వ విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కతజ్ఞతలు అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts