సూర్య చిత్రానికి దర్శకత్వం!

0

Director Vikram K Kumar @ Ishq Press Meet Picturesమనం చిత్రంతో దర్శకుడిగా తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు విక్రమ్.కె.కుమార్. ఈ చిత్రాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి విమర్శకుల ప్రశంసలు పొందారాయన. ఈ సినిమా విజయంతో దక్షిణాది చిత్ర వర్గాల్ని ఆకట్టుకున్న ఈ దర్శకుడు తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. 13 బీ చిత్రంతో దర్శకుడిగా తమిళంలో అరంగేట్రం చేసిన ఆయన అగ్ర కథానాయకుడు సూర్యతో ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు తమిళ సినీవర్గాల సమాచారం.

ఇటీవలే సూర్యను కలిసిన విక్రమ్ కుమార్ ఆయనకు ఓ కథను వినిపించినటు,్ల దానికి సూర్య కూడా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. వినూత్న కథ, కథనాలతో నవ్య రీతిలో సాగే ఈ చిత్రంలో సూర్య పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగనుందని సమాచారం. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్ పైకి రానున్నట్లు తెలిసింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts