సూపర్‌స్టార్ పని నేటితో అయిపోయినట్టే

0

252_photoఎప్పుడెప్పుడా అని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూసే “ఆగడు” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి ఘట్టానికి చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు తన వంతు డబ్బింగ్ నేటితో (9 సెప్టెంబరు) ముగియనుంది. భారీ తారాగాణంతో, శ్రీను వైట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఈనెల సెప్టెంబరు 19 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఫైనల్ డే షూటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చిన మహేష్ బాబు గత రెండు రోజులుగా కంటిన్యూగా డబ్బింగ్ చెబుతున్నాడు. కేవలం క్లైమాక్స్ పార్ట్ డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉంది. క్లైమాక్స్ పార్ట్ డబ్బింగ్ నిమహేష్ బాబు నేటితో పూర్తి చేయనున్నాడు అని సమాచారం.

సోనూ సూద్ కి డబ్బింగ్ చెబుతున్న రవిశంకర్ కూడా తన పార్ట్ కి డబ్బింగ్ పూర్తి చేసాడు. వీరితో పాటు మిగిలిన నటీనటుల డబ్బింగ్ ఇప్పటికే ముగిసింది. మరోవైపు తమన్ కూడా రీ రికార్డింగ్ పనులను చకచకా పూర్తి చేస్తున్నాడు. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న సమయానికే పూర్వవుతున్నాయి. దాంతో ఈ సినిమా సెప్టెంబర్ 19న వచ్చి తీరుతుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్ లో విడుదలైన పంచ్ డైలాగ్స్ కి, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

మహేష్ మరి వంద రోజులదాకా “ఆగడో” లేక రెండు వందల రోజుల దాకా “ఆగడో” మరి కొద్ది రోజులు మనం ఆగితే తెలిసిపోతుంది…!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts