సూపర్‌స్టార్ పదిహేనేళ్ళ ప్రస్థానం

0

maheshbabuరెండేళ్లకో సినిమా చేద్దాం అనుకున్నప్పుడే అస్సలు ఖాళీలేని హీరో సోపర్‌స్టార్ మహేష్‌బాబు. అలాంటిది ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలి అనుకున్నప్పుడు ఇక ఖాళీగా ఉంటాడా?సమస్యే లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేష్ మేనియానే అంటే అతిశయోక్తి కాదు. అతను అభిమానులకు ప్రిన్స్.. అమ్మాయిలకు రాజకుమారుడు.. బాక్సాఫీసు ‘పోకిరి’ మహేష్‌బాబు. మహేష్ పేరెత్తితే చాలు.. బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురుస్తోంది. స్టార్ దర్శకుల కలాలు.. మహేష్ కోసం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రికార్డులు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి.

ఈ ప్రభంజన ప్రయాణం మొదలై పదిహేనేళ్లు. 1999 జులై 30న ‘రాజకుమారుడు’ విడుదలైంది. అప్పటి నుంచీ మహేష్ దూకుడు చూపిస్తూనే ఉన్నాడు. బాల నటుడిగా ‘నీడ’ (1979)తోనే తెరకు పరిచయమైన మహేష్… పదకొండేళ్ల తరవాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఓ కథానాయకుడిని, అందునా తొలి సినిమా హీరోని ఎలా చూపించాలో కె.రాఘవేంద్రరావుకి బాగా తెలుసు. ఆయన దిశానిర్దేశకత్వంలో.. దర్శకత్వంలో మహేష్ తనకు తెలిసిన అన్ని కళలనూ ఆ సినిమాలోనే ప్రదర్శించాడు. బాక్సాఫీసు దగ్గర తొలి అడుగుతోనే విజయాన్ని దక్కించుకొన్నాడు. ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా నంది పురస్కారాన్నీ అందుకొన్నాడు.

‘మురారి’తో కుటుంబ ప్రేక్షకులకు నచ్చిన హీరోగా మారాడు. ‘ఒక్కడు’తో.. మాస్ మనసుల్ని గెలుచుకొన్నాడు. అక్కడి నుంచి మహేష్ ప్రయాణం పరుగులెట్టింది. ‘పోకిరి’తో టాలీవుడ్ వసూళ్ల స్థాయిని పెంచేశాడు. ‘దూకుడు’, ‘బిజినెస్‌మేన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’… ఇలా విజయాల పరంపర కొనసాగింది. పారితోషికం అందుకోవడంలోనూ, మార్కెట్‌ని విస్తరించుకోవడంలోనూ మిగతా కథానాయకులకంటే ముందే ఉన్నాడు మహేష్. ఓవర్సీస్‌లో మహేష్ మార్కెట్‌కి తిరుగులేదు. ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో…’ విదేశీ వసూళ్లే అందుకు నిదర్శనం. ఇది వరకు రెండేళ్లకు ఓ సినిమా అంటూ పరిమితులు విధించుకొన్నా.. ఇప్పుడు ఆ హద్దులు చెరిపివేశాడు. ప్రస్తుతం ‘ఆగడు’ చిత్రీకరణ దశలో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలో మొదలు కానుంది. మరో అరడజను దర్శకులు మహేష్‌కి కథలు వినిపించే పనిలో ఉన్నారు. బాక్సాఫీసు దగ్గర మహేష్ దూకుడు ఇలాగే సాగిపోవాలన్నది ఆయన అభిమానుల ఆకాంక్ష. వారి అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ, విజయయాత్ర సాగిస్తున్న మహేష్… నిజంగానే ‘ఆగడు’.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప‌వ‌న్ టైటిల్ `రాజా వ‌చ్చినాడు`!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ...
మెగాస్టార్ 151వ సినిమా `ఉయ్యాలవాడ` మొద‌లైంది
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం నేడు హైద‌రాబాద్ లో మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక...
సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె...
powered by RelatedPosts