సూపర్‌స్టార్ కి మరో అరుదైన గౌరవం

0

amitabh-bachchanబాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. సిడ్నీలోని మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్ మైనపు బొమ్మను ఈ ఏడాది చేర్చబోతున్నారు. ఈ విషయాన్ని మ్యూజియం వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. దీంతో కెప్టెన్ కుక్, డాన్ బ్రాడ్ మన్, నికోల్ కిడ్మన్, హగ్ జాక్ మన్, జానీ డెప్, లేడీ గాగాల సరసన అమితాబ్ మైనపు బొమ్మ కూడా చేరబోతోంది. ఈ బొమ్మను ఇంటరాక్టివ్ సెట్టింగ్ లో పెట్టబోతుండటంతో అభిమానులు దానికి సమీపంగా వెళ్లి స్వయంగా అమితాబ్ ను కలిసిన అనుభూతిని కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది.

ఇప్పటికే ప్రఖ్యాత లండన్ టస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్ మైనపు బొమ్మ ఉంది. ఇప్పుడు సీడ్నీలో కూడా పెట్టబోతున్నారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ నెట్ పోల్ నిర్వహించి, ఈసారి టస్సాడ్స్ మ్యూజియంలో ఏ సెలబ్రిటీ బొమ్మ పెట్టాలని అడిగితే, ఎక్కువ మంది అమితాబ్ నే ఎన్నుకున్నారట. ఈ విషయాన్ని మ్యూజియం జనరల్ మేనేజర్ క్విన్ క్లార్క్ ప్రకటించారు. ఇప్పటికే జీవితకాల సాఫల్యాన్ని సాధించిన అమితాబ్ బచ్చన్ విగ్రహం పెట్టడం మ్యూజియానికే గౌరవం అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమితాబ్ అభిమానులు ఈ విషయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు .

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts