సూపర్‌స్టార్ కిడ్నాప్ గీతావిష్కరణ

0

Shraddha Das Pics (9)శ్రద్ధాదాస్ కథానాయికగా నటిస్తున్న సూపర్‌స్టార్ కిడ్నాప్ చిత్ర గీతాలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ సినిమాలో నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎ.సుశాంత్‌రెడ్డి దర్శకత్వంలో చందు పెన్మత్స ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో సీడీని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. తొలి ప్రతిని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి స్వీకరించారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ సూపర్‌స్టార్ కిడ్నాప్ అన్న ఐడియా వచ్చిన దగ్గరి నుంచి ఈ చిత్ర టీమ్ నాతో అన్ని విషయాలు చెబుతూ వచ్చారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో నటీనటులే కాకుండా అల్లరి నరేష్, నేను, ప్రిన్స్‌తోపాటు మరో ఏడుగురు నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రమిది. ఇటీవలే రషెస్ చూశాను. సినిమా బాగా వచ్చింది. ఆద్యంతం వినోదాన్ని అందించే సినిమా ఇది. నందు, ఆదర్శ్, భూపాల్‌కు మంచి పేరొస్తుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఊహించని సంఘటనల వల్ల చిక్కుల్లోపడ్డ ముగ్గురు యువకులు సూపర్‌స్టార్ మహేష్‌బాబును కిడ్నాప్ చేయాలనుకుంటారు. వారు వేసిన ప్లాన్ ప్రకారం కిడ్నాప్ జరిగిందా? లేదా? అన్నది తెరపైన చూడాల్సిందే. మంచి టీమ్‌తో పనిచేశాను. పాటలు బాగా కుదిరాయి అని తెలిపారు. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని నిర్మాత అన్నారు. కథకు అనుగుణంగా మంచి పాటలు కుదిరాయని సాయికార్తీక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రద్ధాదాస్, రానా, సుదీప్, నిఖిల్, వరుణ్ సందేశ్, ప్రిన్స్, శ్రీనివాస్ అవసరాల, నందు తదితరులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts