సినీ పరిశ్రమ ఎక్కడికైనా తరలివెళ్లొచ్చు!

0

Suresh-Babuప్రభుత్వాలు ప్రకటించే రాయితీలు, సౌకర్యాల కల్పన, చిత్రీకరణలో సౌలభ్యాన్ని బట్టి పరిశ్రమ పయనం ఆధారపడివుంటుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు వస్తుండటం వల్ల రాబోయే ఐదేళ్లలో చిత్రసీమలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. సినిమా పరిశ్రమ విజయవాడ, వైజాగ్, తడలాంటి ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు చిత్రసీమ భవితవ్యం ఎలా వుండబోతుందనే విషయాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్వీయనిర్మాణ సంస్థ సురేష్‌ప్రొడక్షన్స్ నిర్మించిన దశ్యం చిత్రం ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సురేష్‌బాబు పాత్రికేయులతో ముచ్చటించారు.

ఐదేళ్లలో మార్పు వస్తుంది
సినిమా పరిశ్రమ ఎక్కడికైనా తరలి వెళ్లొచ్చు. ఇక్కడే శాశ్వతంగా వుంటుందని అనుకోవడానికి వీల్లేదు. రాబోవు రోజుల్లో చిత్ర నిర్మాణంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. కరీంనగర్ నేపథ్యంలో కథ వుంటే అక్కడికే వెళ్లి చిత్రీకరణ చేసుకోవచ్చు. ప్రస్తుతమున్న డిజిటల్‌యుగంలో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలకు ల్యాబ్‌లు అవసరం లేదు. ల్యాప్‌టాప్‌లోనే ఎడిటింగ్ చేసుకోవచ్చు. కొంచెం డబ్బు వెచ్చిస్తే ఇంట్లోనే డబ్బింగ్, మ్యూజిక్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ కథ డిమాండ్ చేస్తే అక్కడే షూటింగ్ జరుపుకొని అక్కడి నుంచే నిర్మాణానంతర కార్యక్రమాలు చేసకునే రోజులొస్తాయి. డిమాండ్ వున్న కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నారు. ఒక్కరోజు షూటింగ్ కోసం వారిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లలేం కదా. అలాంటి వారికోసం పరిశ్రమ ఇక్కడే వుండాలని కోరుకుంటున్నారు. పరిశ్రమ వివిధ ప్రాంతాలకు విస్తరించినా కొన్ని సౌకర్యాల దష్ట్యా ప్రధానంగా చెన్నై, హైదరాబాద్, వైజాగ్‌ల నుంచే ముఖ్య కార్యకలాపాల్ని నిర్వహిస్తుందని భావిస్తున్నాను.

డిమాండ్‌ను సష్టించుకోవాలి
ఎగ్జిబిటర్స్ నుంచి సినిమాకు డిమాండ్‌ను మనమే సష్టించుకోవాలి. మంచి సినిమాలు తీస్తే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను తీసుకోవడానికి ముందుకొస్తారు. అంతేకాని సినిమా పూర్తయిన వెంటనే థియేటర్లు దొరకడం లేదని గొడవ చేస్తే ఎట్లా? సినిమాల గురించి పట్టించుకోకుండా పరిశ్రమ మొత్తం కొందది చేతుల్లోనే వుందని విమర్శలు చేయడం మంచిపద్ధతి కాదు. రాత్రికిరాత్రి ఇక్కడెవరూ గొప్పవాళ్లు కాలేదు. సురేష్‌ప్రొడక్షన్స్ ఎదుగుదల వెనక 50 ఏళ్ల శ్రమ వుంది. చట్టప్రకారం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిజినెస్ చేస్తే తప్పేలా అవుతుంది? భారతదేశం మొత్తంగా చూసినా కూడా థియేటర్లు కొందరి చేతుల్లోనే వున్నాయి. బాలీవుడ్‌లో కూడా కొన్ని సంస్థలే అగ్ర తారలతో భారీ చిత్రాల్ని నిర్మిస్తున్నాయి. అక్కడ టాప్‌హీరోలందరకీ స్వీయనిర్మాణ సంస్థలున్నాయి. చట్టానికిలోబడి ఎలాంటి వ్యాపారం చేసుకున్నా తప్పుకాదు. పరస్పరం విమర్శించుకునే బదులు నిర్మాణాత్మకంగా ఆలోచిస్తే అందరం అభివద్ధిని సాధించగలుగుతాం.

ఇక్కడ ఐడియాలు లేవు
సినిమా నిర్మాణపరంగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలున్నాయి. పూర్తిస్థాయి హాలీవుడ్ చిత్రాన్ని తీసే సాంకేతికత అందుబాటులో వుంది. అయితే మనదగ్గర ఐడియాలు కరువవుతున్నాయి. ఒక్క తెలుగు సినిమా పరిధిలోనే ఆలోచిస్తున్నాం. మన కౌశలాల్ని విస్త్రతపరుచుకుంటే హైదరాబాద్‌లోనే అద్భుతమైన సినిమాల్ని తీయొచ్చు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts