సల్మాన్ మందు తాగాడో లేదో గుర్తులేదు

0

SALMAN_KHANపన్నెండేళ్ళ క్రితం బాలీవుడ్ కండల వీరుడు తప్పతాగి ఒక అర్ధరాత్రి పూట ముంబై వీధుల్లో బాధ్యతారాహిత్యంతో కారు నడుపుతూ, ఫుట్ పాత్ మీద పడుకున్న వారి మీదుగా కారు పొనిచ్చి ఒకరి మృతికి కారణం అయ్యాడు అన్న సంగతి గుర్తుందా? ఆ ఘటనలో మరో నాలుగు తీవ్రంగా గాయపడ్డారు కూడా. అయితే, ఆ రోజు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మందు కొట్టి ఉన్నాడో లేదో తనకు తెలియదని హిట్ రన్ కేసులో బార్ మేనేజర్ కోర్టులో సాక్ష్యం చెప్పారు. ముంబై కోర్టులో సోమవారం జరిగిన విచారణలో సల్మాన్ ఖాన్ ను బార్ మేనేజర్ గుర్తించాడు.

2002లో జరిగిన కారు ప్రమాదానికి ముందు సల్మాన్ తన స్నేహితులతో బార్ కు వచ్చారని అన్నారు. అయితే స్నేహితులతో కలిసి మద్యం సేవించారో లేదో తనకు సరిగా గుర్తులేదని కోర్టుకు తెలిపారు.

2002 సెప్టెంబర్ 28న జరిగిన ప్రమాదానికి ముందు సల్మాన్ ఖాన్ మద్యం సేవించారా అనే కోణంలో ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. బాంద్రా సబర్బన్ లో తప్పతాగి కారు నడపడంతో ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడిన సంఘటనలో సల్మాన్ ఖాన్ పై హిట్ రన్ కేసు నమోదైంది.

ఇన్నేళ్లపాటు ఒక్కో కేసు సా…………………….గుతుంటే, దోషులకి అసలు చట్టం అంటే భయం ఎందుకు ఉంటుంది?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
powered by RelatedPosts