సల్మాన్ ని వాళ్ళెవరూ పట్టించుకోవట్లేదా?

0

Kick_posterసల్మాన్ కొందరికి గుడ్ బాయ్, మరికొందరికి బ్యాడ్ బాయ్. అది ఇప్పుడు కాదు, సల్మాన్ నటనా ప్రస్థానం మొదలైన తొలినాటి నుండి జరుగుతున్న విషయమే. గత శుక్రవారం సల్మాన్ హీరోగా విడుదలైన “కిక్” సినిమా, అన్ని చోట్లా మంచి కలెక్షన్లు సాధిస్తూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. “కిక్” చిత్రం ప్రమోషన్ విషయంలో కూడా సల్మాన్ తాను చేయగలిగింది అంతా చేస్తున్నాడు. అయితే, ఈ చిత్ర ప్రచారం సందర్భంగా పది రోజుల క్రితం ఫొటోగ్రాఫర్లతో, సల్లూ భాయ్‌కి రేగిన వివాదం మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది.

సాజిద్ నడియాడ్‌వాలా దర్శకత్వంలో తయారైన ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేసినప్పుడు ఫొటోగ్రాఫర్లు కూడా హాజరయ్యారు కానీ, సల్మాన్‌ను ఫొటో తీయలేదు. సినీ కార్యక్రమాల్లో సల్మాన్ ఫొటోలు తీయకూడదంటూ, తమకు తాముగా విధించుకున్న నిషేధానికి ముంబయ్ ఫొటోగ్రాఫర్లు కట్టుబడి ఉన్నారు. ఈ నిషేధం ఫలితంగా ‘కిక్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్ ఫొటోలు రావడం లేదు.

సల్మాన్ దురుసు ప్రవర్తనకు నిరసనగా, ఆయనను బాయ్‌కాట్ చేయాలని ముంబయ్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్ణయించుకున్నప్పటికీ, సినిమా ప్రమోషన్‌కు మాత్రం సహకరించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ మాట మీదే నిలబడింది. అయితే, సల్లూ భాయ్ మాత్రం ఫొటోగ్రాఫర్ల నిషేధాన్ని తేలికగా తీసుకొని, ‘వాళ్ళ వల్ల నేనేమీ స్టార్‌ను కాలేద’న్న మాటకే కట్టుబడ్డారు.వెరసి, ప్రత్యేక ప్రదర్శనలో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స్క్రీన్‌ప్లే రచనలో పాలుపంచుకొన్న ప్రముఖ రచయిత చేతన్ భగత్, నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి వారి ఫోటోలు తీయడంలో ఫొటోగ్రాఫర్లు మునిగిపోయారు. ఈ వివాదానికీ సల్మాన్ ముగింపు పలుకుతాడా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగి చూడాల్సిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts