సమంతా త్వరలో మరో సినిమాతో

0

Samantha at Lovers Audio Launch (21)తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంతా త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూర్య కథానాయకుడిగా తమిళంలో ఎన్.లింగుస్వామి అంజాన్ పేరుతో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయనతో కలిసి లగడపాటి శిరీష, శ్రీధర్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో సికిందర్ అనే పేరుని ఖరారు చేశారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రాజు భాయ్ అనే ఓ మాఫియా డాన్ కథ ఇది. సూర్య పాత్ర చిత్రణతో పాటు అతని వేషధారణ కూడా కొత్తగా వుంటుంది. రాజు అనే ఓ యువకుడు డాన్‌గా ఎందుకు మారాడన్నదే ఇందులో ఆసక్తికరం. ముంబై నేపథ్యంలో కథ సాగుతుంది.సూర్య నటన అతనిపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు, సమంతా గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందిఅన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ వైవిధ్యమైన పాత్రలంటే ప్రత్యేక ఆసక్తిని కనబరిచే సూర్య ఈ సినిమాలో ైస్టెలిష్ డాన్‌గా కనిపించబోతున్నాడు. ఇందులో సూర్యతో సమంతా పోటాపోటీగా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం, సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి అన్నారు. విద్యుత్ జమ్‌వాల్, మనోజ్ బాజ్‌పాయ్, బ్రహ్మానందం, సూరి, రాజ్‌పాల్ యాదవ్, దలీప్ తాహిల్, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts