సన్నీ ఉంటే బాగుంటుందనుకున్న పూరీ

0

sunny leone“సన్నీ లియోన్” అంటే తెలియని కుర్రకారు ప్రస్తుతం ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అరటిపండు తొక్క తీసేసినంత తేలిగ్గా బట్టలు తీసేసి, కైపు ఎక్కించగల కత్తిలాంటి ఫిగర్ సన్నీ లియోన్ సొంతం. అందుకే, నీలి చిత్రాల్లో స్టార్ అయిన సన్నీని మొత్తానికి భారతీయ దర్శకుల చేతిలో పడింది. “జిస్మ్-2” ద్వారా బాలీవుడ్ లో పరిచయమైన సన్నీ, “రాగిని ఎంఎంఎస్ -2 ” చిత్రంతో అందరి మతి పోగొట్టింది. ఇక్కడ అమ్మడుకి అవకాశాలు ఆశాజంకంగానే ఉండటంతో, తన పాత పనులకి స్వస్తి పలికి బాలీవుడ్ లోనే పాగా వేసుకుని కూర్చుంది.

ముఖ్యంగా సన్నీతో ఐటమ్ సాంగ్స్ చేయించడానికి చాలామంది దర్శక, నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ఉత్తరాదిన మాత్రమే కాదు.. దక్షిణాదిన కూడా తనకు క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే తమిళంలో ‘వడకర్రీ’ అనే సినిమాలో ఐటమ్ సాంగ్ కి డాన్స్ చేసింది సన్నీ. ఈ సినిమా తెలుగులో ‘కుల్ఫీ’ పేరుతో విడుదల కానుంది. కాగా, తమిళ పరిశ్రమలో సన్నీకి మరిన్ని అవకాశాలు ఉన్నాయట. ఇదిలా ఉంటే… మనోజ్ నటిస్తున్న ‘కరెంట్ తీగ’లో సన్నీని ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. ఇది కాకుండా సన్నీ ఖాతాలో మరో తెలుగు సినిమా పడే అవకాశం ఉందనే వార్త వినిపిస్తోంది. ఆ సినిమా వివరాల్లోకెళితే…

“ఐటెం సాంగ్” లేకుండా సినిమాలు తీయని పూరీ జగన్నాధ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు ముమైత్ ఖాన్, గబ్రియేలా తదితరులతో ప్రత్యేక గీతాలకు డాన్స్ చేయించాడు పూరి. కేవలం ఐటమ్ సాంగ్స్ కి మాత్రమే కాకుండా.. వాళ్లని కొన్ని సన్నివేశాల్లో నటింపజేస్తాడు కూడా. తాజాగా ఎన్టీఆర్ హీరోగా తను దర్శకత్వం వహించనున్న సినిమాలో సన్నీని తీసుకోవాలనుకుంటున్నాడట పూరి. మరి.. తనను కేవలం ఐటమ్ సాంగ్ కే వాడుకుంటాడా? లేక కొన్ని సన్నివేశాల్లో నటింపజేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా గురించి సన్నీతో పూరి మంతనాలాడుతున్నాడని సమాచారం.

పూరీ చేతిలో పడితే, పూట గడవటం కూడా కష్టమయ్యే స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా మూడు పూటలా ఫూల్ మీల్స్ తినే రేంజ్ వచ్చేస్తుంది అని ఇండస్ట్రీ టాక్. సన్నీ పరిస్థితి అలా లేకున్నా, మళ్లీ బాలీవుడ్ కి వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే స్థిరపడిపోయే రేంజ్ లో, పూరీ సన్నీ ని “ప్రోత్సహిస్తాడు” అని చెప్పుకోవచ్చు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప‌వ‌న్ టైటిల్ `రాజా వ‌చ్చినాడు`!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ...
మెగాస్టార్ 151వ సినిమా `ఉయ్యాలవాడ` మొద‌లైంది
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం నేడు హైద‌రాబాద్ లో మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక...
సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె...
powered by RelatedPosts