సగటు మనిషి అంతర్మథనం

0

jagathiజగపతిబాబు, కల్యాణి జంటగా నటిస్తున్న చిత్రం ఓ మనిషి కథ. రాధాస్వామి ఆవుల దర్శకుడు. ఓం శివ్ ప్రొడక్షన్స్ పతాకంపై బాలా భాయ్ చోవాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవల ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సినిమా చూసిన తరువాత రాధాస్వామి గనుక నేను సినిమాలు తీస్తున్న సమయంలో తెలుగు చిత్రపరిశ్రమకు వచ్చి వుంటే నాకు పోటీనిచ్చేవాడేమో అనిపించింది. ఒక మనిషి జీవితంలోని సమస్యలను, ఆ సమస్యలను ఎదుర్కొవడానికి ఆ మనిషి పడే ఆరాటాన్ని రాధాస్వామి తెరకెక్కించిన తీరు అద్భుతం. ముఖ్యంగా జగపతిబాబు నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

జగపతిబాబు భార్యగా కల్యాణి కూడా మంచి పాత్రలో నటించింది. సుద్దాల అశోక్‌తేజ అందించిన సాహిత్యం ఈ చిత్రానికి అయువుపట్టుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై రెండవ వారంలో ఆడియో, నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts