సంగీతమంటేనే మక్కువ – అమ్రేష్

0

Amresh (1)

Amresh (2)

Amresh (3)

Amresh (4)

Amresh (5)

సినీయర్ నటి జయచిత్ర దర్శకత్వంలో 2010లో విడుదలైన ‘నానే ఎన్నిల్ ఇళై’( నేను నాలో లేను) సినిమా ద్వారా ఆమె తనయుడు అమ్రేష్ ను హీరోగా, సంగీత దర్శకునిగా సినిపరిశ్రమకు పరిచయం చేసింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో విరామం తీసుకున్న అమ్రేష్ ఆర్.బి.చౌదరి బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మిస్, వెందర్ మూవీస్ బ్యానర్ లో ఎస్.మదన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మోట్ట శివ కేట్ట శివ’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు సాయి రమని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్, నిక్కి గల్రాని జంటగా నటిస్తున్నారు. 65శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 7న శివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా అమ్రేష్ మీడియాతో మాట్లాడారు. మోట్ట శివ కేట్ట శివ అల్బమ్ లో మొత్తం ఆరు పాటలు డిఫరెంట్ జోనర్ లో ఉంటాయని తెలిపారు. దివంగత ఎంజీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలో నుంచి ఓ పాటను ఈ సినిమాలో రిమిక్స్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సాంగ్ ను శంకర్ మహాదేవన్ పాడారని తెలిపారు. అమ్మ (జయచిత్ర) కోరిక మేరకు ఆమె దర్శకత్వంలో హీరోగా పరిచయమైన్నట్లు తెలిపారు.నటుడి కంటే సంగీతం అంటేనే తనకు ఇష్టమని తెలిపారు. 12ఏళ్ళ వయస్సు నుంచే కీబోర్డు వాయించడం నేర్చుకున్నాని, ఏఆర్.రహ్మన్, మణిశర్మ వంటి లెజండ్ సంగీత దర్శకుల వద్ద సంగీతం నేర్చుకున్నాని తెలిపారు. సంగీత దర్శకుడిగా ఈ సినిమా ద్వారా తన సత్త నిరూపించుకున్న అనంతరం వస్తున్న ఆఫర్లను వదులుకొనన్ని తెలిపారు. తెలుగు పటాస్ కు ఈ సినిమా రిమేక్ అయినప్పటికి అందులో నుంచి చిన్న సౌండ్ కూడా ఉపయోగించలేదన్నారు. తన సంగీతం విన్నఆర్.బి.చౌదరి, లారెన్స్, మదన్, శంకర్ మహాదేవన్ వంటి ప్రముఖులు మొచ్చుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అమ్రేష్ సంగీత దర్శకుడిగా పేరుప్రఖ్యాతులను సంపాధించుకోవాలని మాస్టార్ తరపున ఆల్ ది బెస్ట్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
powered by RelatedPosts