షూటింగ్ పూర్తికావస్తున్న "కాకతీయుడు"

0

 

విజయ సముద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకతీయుడు’. శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై లగడపాటి వెంకాయమ్మ సమర్పణలో హిమబింధు, మాస్టర్ ఎల్.భార్గవ్, మాస్టర్ ఎల్.పార్ధు నిర్మాణ సారధ్యంలో లగడపాటి శ్రీనివాస్, గూడూరు గోపాల్ శెట్టి నిర్మిస్తున్న చిత్రం “కాకతీయుడు”. ఇందులో నందమూరి తారకరత్న, శిల్పా, యామిని నటీనటులుగా నటిస్తుండగా, విజయ సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 80శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ రోజు (14.6.2014) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

డైరెక్టర్ విజయ సముద్ర మాట్లాడుతూ – ”వినుకొండలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించాం. వినుకొండ, గుంటూరు తదితర పరిసర ప్రాంతాల్లో 80 శాతం షూటింగ్ పూర్తి చేసాం. ఈ చిత్ర నిర్మాత నాకు మిత్రుడు. తారకరత్నతో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. చండీ చిత్రానికి సంగీతం ఇచ్చిన యస్.ఆర్.శంకర్ ఈ చిత్రానికి సంగీతం ఇచ్చారు. పాటలన్నీ బాగా కుదిరాయి. వినోద్ కుమార్ ఈ చిత్రంలో మెయిన్ విలన్. తారకరత్న పెర్ ఫామెన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లు తెలుగువారు. చక్కగా నటించారు” అని తెలిపారు.

హీరో తారకరత్న మాట్లాడుతూ – ”ఈ చిత్రం నిర్మాతలతో నాకు పదేళ్ల నుంచి పరిచయం ఉంది. సినిమా రంగంలోకి రావాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారు. తొలి సినిమా నాతోనే చేస్తానన్నారు. చెప్పినట్టుగానే ఈ సినిమా నాతోనే ఆరంభించారు. సముద్రగారి దర్శకత్వంలో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. ఫ్యామిలీ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అన్నారు.

ఈ సినిమాలో నటించే అవకాశం ఇవ్వడం పట్ల హీరోయిన్లు శిల్పా, యామిని దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

ప్రభ, లగడపాటి వెంకట్రావు, ప్రభావతి, తిరుపతి ప్రకాష్, సంజయ్, అనిల్, రోహిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – యస్.ఆర్.శంకర్, ఎడిటింగ్ – నందమూరి హరి, కెమెరా – పి.సహదేవ్, పి.ఆర్.ఓ – సజ్జా వాసు, కథ, మాటలు – మల్కార్ శ్రీనివాస్, సహ నిర్మాతలు – పొందూరు కాంతారావు, నిర్మాతలు – లగడపాటి శ్రీనివాస్, గూడూర్ గోపాల్ శెట్టి, కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – విజయ సముద్ర.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
మెగాస్టార్ 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ..గౌర‌వంగాను భావిస్తున్నాను: ద‌ర్శ‌క ధీర‌డు రాజ‌మౌళి
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు స...
powered by RelatedPosts