షారూఖ్ ప్రశంస మరువలేనిది

0

Deeksha Seth Latest Hot Photos (19)దక్షిణాదిలో కాలం కలిసిరాకపోవడంతో ఉత్తరాదిపై కన్నేసింది దీక్షాసేథ్. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాల్లో నటించిన ఈ సుందరి ఇటీవలే లేకర్ హమ్ దీవానా దిల్ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రముఖనటుడు రాజ్‌కపూర్ కుటుంబానికి చెందిన అర్మాన్ జైన్ ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యాడు. దినేష్ విజన్, సునీల్ లుల్లాతో కలిసి సైఫ్ అలీఖాన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయినా దీక్షాసేథ్‌కు మాత్రం బాలీవుడ్‌లో మంచి ఎంట్రీగా పనిచేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా దీక్షాసేథ్ మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు లభించినా కమర్షియల్ కథానాయికగా పేరు తెచ్చుకోలేకపోయాను. ఆ లోటును తీర్చుకోవాలన్న పట్టుదలతో బాలీవుడ్‌లోకి ప్రవేశించాను. తొలి సినిమాతో చాలా మంది దష్టిని ఆకర్షించడంలో సఫలీకతమయ్యానని భావిస్తున్నాను. సినిమా చూసిన తరువాత షారూఖ్‌ఖాన్ చాలా బాగా నటించావని అభినందించడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. సినిమా ఫలితం ఎలా వున్నా బాలీవుడ్ చిత్రపరిశ్రమ వర్గాల దష్టిలో పడ్డాను. ఈ చిత్రం తరువాత నా కెరీర్ బాలీవుడ్‌లో సాఫీగా సాగిపోతుందన్న నమ్మకం ఏర్పడింది అని తెలిపింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts