షాక్ ఇవ్వడానికి సిద్దమవుతున్న షకీల

0

462eb1ca0a8544c1a94be1af57ff3163ఒకప్పుడు ఆమె సినిమాలు విడుదలవుతున్నాయి అంటే, టాప్ హీరోలందరూ తమ సినిమాల విడుదలని వాయిదా వేసుకునేవారు. అతితక్కువ బడ్జెట్ తో సినిమా తీసేసి, పెద్ద పెద్ద బడ్జెట్ తో సినిమాలు తీసే దర్శక నిర్మాతలకి ఆమె ముచ్చెమటలు పట్టించేది. ఆమె ఎవరో ఈపాటికే అర్ధమయిపోయి ఉంటుంది. శృంగార నాయికగా ఆ సంచలనానికి కేంద్ర బిందువు అయింది మరెవరో కాదు, షకీల. లోగడ, వెండితెర నటీమణుల జీవితాలతో గతంలో ఎన్నో సినిమాలు తెరకి ఎక్కాయి. డర్టీ పిక్చర్ లాంటి సినిమాలైతే సూపర్ డూపర్ హిట్ సాధించాయి.

కలెక్షన్లే కాకుండా, అవార్డుల వర్షం కూడా కురిపించాయి. తెర వెనుక చీకటి నిజాలు, హీరోయిన్ లు కష్ణాలు, వారు ఎదుర్కొనే అవమానాలు, మానాభిమానాలను కాపాడుకోవడానికి వారు పడేపాట్లను ఇటీవల షకీల బయటపెట్టారు. దాంతో గుమ్మడికాల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కొందరు పెద్దలు ఉలిక్కిపడ్డారు. అందరూ పెద్దలు కాదని వాళ్ళలో కొందరు గద్దల కూడా ఉన్నారని ఆమె విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ నిజాలన్నీ కలిపి షకీల సినిమా కూడా తీస్తున్నారు.

సినీ జీవితంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తాను పడ్డ అవమానాలు, ఎదుర్కొన్న చీత్కారాలు, వేధింపులతో ఏకంగా షకీల గతంలో ఓ పుస్తకమే రాశారు. ఈ పుస్తకం సంచలనాలకు కేంద్రబిందువైంది. ఇప్పుడు అదే పుస్తకం ఆధారంగా సినిమా నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఆ సినిమాలో తానే లీడ్ రోల్ లో నటించబోతోంది. పుస్తకం అందరికీ చేరడానికి కొంత సమయం పడుతుంది. అదే సినిమా అయితే జనాల్లోకి చాలా తేలికగా చొచ్చుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన తరువాత కొందరు నొచ్చుకొవడం ఖాయం. అందుకే నిజాలు తెలిస్తే తనను చంపేసినా చంపేస్తారని షకీల అనుమానం కూడా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన షకీల రూపొందించే ఈ సినిమా నిర్మాణం పూర్తి అవ్వడానికి ఏమైనా అడ్డంకులు ఎదురవుతాయా అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.

డర్టీపిక్చర్ లాగా, తన జీవిత చరిత్రతో కూడా ఎవరైన సినిమా తీస్తారని షకీల ఇన్ని రోజులు ఆగిందా? అని అనుకునేవారు కూడా చాలామందే ఉన్నారు. ఏదేమైనా, షకీల సినిమా విడుదలయ్యాక, కచ్చితంగా అదొక పెద్ద సెన్సేషన్ అవుతుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts