"షమితాబ్" గుట్టు విప్పిన అమితాబ్

0

Shamitabఅమితాబ్ అంటే తెలియని వారు ఉండరు కానీ, ఈ షమితాబ్ ఎవరబ్బా మధ్యలో అనుకుంటున్నారా?బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ తాజాగా నటిస్తున్న కొత్త చిత్రం పేరే ఈ “షమితాబ్” . ఆ సినిమాలోని తన గెటప్ ని అమితాబ్ తన బ్లాగు ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.
అడ్డదిడ్డంగా పెరిగిన జుట్టు, గెడ్డంతో అమితాబ్ (71) ఈ సినిమాలో ఎలా కనిపిస్తున్నారో మీరే చూడండి. ఫొటోగ్రాఫర్ల కంటపడకుండా ఈ సినిమా గెటప్ ను ఎక్కువ కాలం దాచి ఉంచడం చాలా కష్టమని, అందుకే తాను విడుదల చేసేస్తున్నానని అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాతో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర కూడా బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే.

సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వందలాది మొబైల్ కెమెరాలు తమ చుట్టూ ఉంటాయని, అలాంటప్పుడు వాటినుంచి ఈ గెటప్ ను కాపాడటం చాలా కష్టమని బచ్చన్ తన బ్లాగులో కూడా రాశారు. షమితాబ్ సినిమాకు ఆర్ బాల్కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు అమితాబ్ నటించిన చీనీ కమ్, పా చిత్రాలకు కూడా బాల్కియే దర్శకుడు. గోవా, తమిళనాడులలో షూటింగ్ చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
శ్ర‌ద్ధాకపూర్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది!
మ‌న స్టార్ హీరోల్లో మ‌గువ‌ల గుండెల్లో మారాజాగా వెలిగిపోతున్న డార్లింగ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  .. లిప్త పాటు కాలంలో  ప్ర‌భాస్ అంటూ ఈజీగానే చె...
ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.  కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ త...
powered by RelatedPosts