శ్వేతాబసుకి అవకాశామిస్తానన్న కుర్ర హీరో?

0

Shweta-Prasad-Photo-Shotతెరచాటు జరిగే భాగోతాలు ఒక్కసారిగా తెరపైకి వస్తే ఇక అంతే సంగతులు. ఆ విషయం ఇటీవలే వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ యువ హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ ని చూస్తే అర్ధమవుతుంది. తెరవెనుక అందరూ చేసే పనే,నేను పట్టుపడే సరికి మిగతా అందరూ పతివ్రతామనుల లాగా ఫోజులు కొడుతున్నారు అన్నట్టుగా శ్వేత మాటల్లోని అంతరార్ధాన్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్వేతబసు టాపిక్ జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. ఈ విషయంలో కొంతమంది ప్రముఖులు ఆమెని సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా మంచు విష్ణు కూడా ఈ విషయం పై స్పందించాడు.

‘ ఈ కేసులో శ్వేతబసుతో పాటు దొరికిన బడాబాబుల పేర్లను మాత్రం పోలీసులు, మీడియా వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు. సినిమా సెలబ్రిటీ అవ్వడం ఆ అమ్మాయి చేసుకున్న పాపమా.? మీడియా, పోలీసులు కూడా ఈ విషయంలో ఎక్కువ అత్యుత్సాహం చూపారు. ప్రతిచోటా తప్పులు జరుగుతాయి. అలా అని ఇలా చూపించడం సబబు కాదు. 11ఏళ్ళ వయసులో జాతీయ అవార్డు అందుకున్న మంచి నటి తను. శ్వేతబసు ప్రసాద్ కి నా తదుపరి సినిమాలో మంచి రోల్ ఇస్తానని’ మంచు విష్ణు అన్నాడు.

మంచు విష్ణు హీరోగా నటించిన ‘అనుక్షణం’ సినిమా సెప్టెంబర్ 13న గ్రాండ్ రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్ స్టైల్లో ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts