శ్రీయ అందం అబ్బురపరిచింది

0

Samantha2గ్లామర్… ప్రస్తుతం ఇది లేని సినిమా ఉందని చె ప్పడం కష్టం. అయినా అలాంటి గ్లామర్ గురించి ఒక్కో హీరోయిన్ ఒక్కో రకంగా స్టేట్‌మెంట్ ఇచ్చేస్తారు. ఆ స్టేట్‌మెంట్‌కయినా కట్టుబడి ఉంటారా? అంటే అవి నీటిపై రాతలే అవుతాయి. ఇవాళ గ్లామర్‌కు నేను వ్యతిరేకిని అన్న నాయకి రేపు విచ్చలవిడిగా గ్లామర్‌ను ప్రదర్శించేస్తుంటారు. అదేమంటే కథ డిమాండ్ మేరకు అందాలారబోయక తప్పలేదంటారు. కొందరైతే గ్లామర్ విషయంలో నా హద్దులు నాకున్నాయంటారు. ముగ్గులోకి దిగిన తరువాత ఇంకా హద్దు లేమిటోమరి.  నేటి కథానాయికలు గ్లామర్‌పై హద్దులు గురించి మాట్లాడడం చోద్యంగా ఉంది కదూ.
 
 తాజాగా నటి సమంత ఇదే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఈ ముద్దుగుమ్మ అయితే ఏకంగా గ్లామర్ అంటేనే భయం అంటున్నారు. అయినా కొన్ని కమర్షియల్ చిత్రాల్లో అలా నటించేశాను అంటున్న సమంత ప్రస్తు తం తమిళంలో విజయ్ సరసన కత్తి చిత్రంలోను, అంజాన్ చిత్రంలో సూర్య సరసన గ్లామరస్ పాత్రల్లోనే నటిస్తున్నారన్నది గమనార్హం. త్వరలో విక్రమ్‌తోనూ రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఇవన్నీ కమర్షియల్ చిత్రాలేనని ఆమె అంగీకరిస్తున్నారు. అదేవిధంగా తెలుగులోనూ ఈ బ్యూటీ స్టార్ సక్సెస్ భారీ చిత్రాల్లో నటిస్తున్నారు.
 
 అయితే తాను తొలి చిత్రంలోనే నటనకు అవకాశం ఉన్న చిత్రంలో తన ప్రతిభ చాటుకున్నానని సమంత ఒకింత గర్వం తొణికిసలాడుతున్న స్వరంతో పేర్కొన్నారు. ఇకపై ఏడాదికొక్క చిత్రంలో అయినా అలాంటి పాత్రను పోషించాలనుకుంటున్నానని సమంత ఓడించారు. ఇటీవల తెలుగులో అక్కినేని కుటుంబం నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఇలా మూడు తరాల నటులతో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటి శ్రీయ కూడా నటించారని ఆమె అందం తనను ఆశ్చర్యపరిచిందని సమంత పేర్కొనడం గమనార్హం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts