"శంకరాభరణం"లో పాడనన్న బాలు

0

spbalaతెలుగు సినీ చరిత్రలో విశ్వనాథ్ తీసిన “శంకరాభరణం” అనేది ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అనడంలో ఎంతమాత్రమూ సందేహం అక్కరలేదు. “శంకరాభరణం” సినిమాకే కాదు, ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సినిమాతో పాటుగా ఎనలేని పేరు ప్రఖ్యాతులూ లభించాయి. ముఖ్యంగా పాటలు. వ్రాసిన వేటూరి కి, బాడిన బాలసుబ్రహ్మణ్యం కెరీర్లలో “శంకరాభరణం” ప్రధమస్థానంలో నిలుస్తుంది అని చెప్పవచ్చు. అలాంటి సినిమాకి మొదట పాటలు పాడను అని బాలు తిరస్కరించిన సంగతి చాలామందికి తెలియదు. ఇంతకీ బాలసుబ్రహ్మణ్యం ఎందుకలా అన్నాడు? ఇదిగో…. మీరే చదవండి.

“శంకరాభారణం” సినిమా విడుదలయి ముప్పై ఐదేళ్ళు అవుతోంది. ఇన్నాళ్ళ తరువాత ఆ సినిమాని తమిళంలో అనువదిస్తున్నారు. ఆ తమిళ అనువాదంలోనూ బాలసుబ్రహ్మణ్యమే అన్ని పాటలు పాడటం విశేషం. ఆ వివరాలని మీడియాతో పంచుకుంటూ, బాలు తన అంతరగాన్ని ఇలా ఆవిషకరించాడు. అదేమిటో ఆయన మాటల్లోనే చదవండి. ” శంకరాభరణం తెరపైకి వచ్చి 35 ఏళ్లయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిత్రం గురించి ఎన్నిసార్లో, ఎన్ని ప్రాంతాల్లో వ్యాఖ్యానించానో, ఎన్నిసార్లు ఎన్ని కచేరీల్లో ఆ చిత్ర పాటలు ఆలపించానో చెప్పలేను. నా సినిమా చరిత్రలో శంకరాభరణం ఒక గొప్ప అధ్యాయం.

ఆ చిత్రం ప్రారంభ సమయంలో నేను రోజుకు నాలుగైదు పాటల రికార్డింగ్ అంటూ బిజీగా ఉన్నాను. అలాంటి సమయంలో కేవీ మహదేవన్ మా ఇంటికొచ్చి నాన్నకు శంకరాభరణం కథ వినిపించారు. అప్పుడు నాన్న ఈ చిత్రంలో పాటలు పాడిన తరువాతే ఇతర చిత్రాల పాటలు పాడమని చెప్పారు. అంతే కాదు శంకరాభరణం చిత్రానికి సరిగా పాడకపోతే చెంప పగలగొట్టి పాడించండి. ఇలాంటి మంచి అవకాశం తనకు మళ్లీ వస్తుందా? అంటూ కే.వీ. మహదేవన్‌తో అన్నారు. ఆ తరువాత దర్శకుడు కె.విశ్వనాథ్ మరోసారి కథ గురించి వివరించారు. అప్పుడు నాకు నిజంగా భయం కలిగింది. అలాంటి చిత్రానికి నేను పాడగలనా అని.

అందుకు కారణం నాకు సంప్రదాయ సంగీతం తెలియకపోవడమే. నేనా సంగీతాన్ని నేర్చుకోలేదు. అందుకే శంకరాభరణం చిత్రానికి నేను పాడలేనన్నాను. అయినా సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ వదలలేదు. ఆయన కంటే కూడా ఆయన శిష్యుడు పుగళేంది మీరే పాడాలంటూ ఒత్తిడి చేశారు. అవసరం అయితే నేర్పించి అయినా పాడిస్తానంటూ ప్రోత్సహించారాయన. పుగళేందినే ట్రాక్ పాడి ఆ క్యాసెట్ నాకిచ్చారు. దాన్ని సమయం దొరికినప్పుడల్లా వింటూ కంఠస్థంగా వచ్చిన తరువాతనే రికార్డింగ్‌కు సిద్ధం అయ్యాను. పాట రికార్డింగ్ సమయంలో ఎస్.జానకి, వాణీజయరాం ఇచ్చిన ప్రోత్సాహం మరవలేను. చిన్నాకుట్టి మృదంగం, రాఘవన్ వీణ, సుదర్శన్ ఫ్లూట్ వాయించారు.

అదండీ సంగతి…!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts